ధాంక్స్… భయ్యా

మహారాష్ట్రలో కాంగ్రెస్ ను కొంపముంచింది ఎంఐఎం అనే అని చెప్పక తప్పదు. మహరాష్ట్రలో జరుగుతున్న కౌంటింగ్ బీజేపీ కూటమికే అనుకూలంగా ఉంది. అయితే దాదాపు 44 స్థానాల్లో [more]

Update: 2019-10-24 06:11 GMT

మహారాష్ట్రలో కాంగ్రెస్ ను కొంపముంచింది ఎంఐఎం అనే అని చెప్పక తప్పదు. మహరాష్ట్రలో జరుగుతున్న కౌంటింగ్ బీజేపీ కూటమికే అనుకూలంగా ఉంది. అయితే దాదాపు 44 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు కాంగ్రెస్ ను దెబ్బతీశారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా విడిగా బరిలో దిగడంతో ముస్లిం ఓటర్లందరూ ఎంఐఎం అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. సహజంగా ముస్లింలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారు. కానీ ఎంఐఎం బరిలో ఉండటంతో వారు అటు వైపు మొగ్గారు. దాదాపు 44 స్థానాల్లో ఎంఐఎం ప్రభావంతో కాంగ్రెస్ ఓటమి పాలయిందంటున్నారు. బీజేపీపై నిప్పులు చెరిగే అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా ఆ పార్టీకి మేలు చేకూర్చారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News