కుంతియా అవుట్.. అదే కారణమా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ ను నియమించింది. అంతేకాదు [more]

Update: 2020-09-12 09:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ ను నియమించింది. అంతేకాదు కుంతియాను సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా కూడా అధిష్టానం తప్పించింది. ఒడిశాకు చెందిన రామచంద్రుని కుంతియాను ఎన్నికలకు ముందు దిగ్విజయ్ సింగ్ ను తప్పించి తాత్కాలిక ఇన్ ఛార్జిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కొన్నేళ్ల పాటు తాత్కాలిక ఇన్ ఛార్జిగానే ఉంచింది.

ఎప్పటి నుంచో అనుకుంటున్నా…..

అయితే కుంతియా కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనలేరని కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి చెప్పి చూశారు. అప్పటికే సీనియర్ నేతలతో విసిిగిపోయి ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కుంతియానే కొనసాగుతాడని తేల్చి చెప్పింది. దీంతో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకు కుంతియానే ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. అయితే రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాకమునుపే కుంతియాను మారుస్తారన్న ప్రచారం జరిగింది.

ఏ నిర్ణయాన్ని ధైర్యంగా…..

కానీ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, సోనియా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుంతియాను మార్చడం కుదరలేదు. నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోవడం, ప్రతి చిన్న అంశానికి నేతలు ఇన్ ఛార్జిని వదిలి అధిష్టానం వైపు చూస్తుండటంతో కుంతియా పనితీరుపై అధిష్టానానికి చిరాకు తెప్పించింది. ఏ నిర్ణయమూ ధైర్యంగా తీసుకోలేకపోవడం, కొందరి వైపు కుంతియా నిలబడటం కూడా అధిష్టానం ఆగ్రహానికి కారణమయిందంటున్నారు.

ఫిర్యాదులు కూడా….

నిజానికి కుంతియా స్థానంలో మరో సీనియర్ నేత ఉండి ఉంటే ఎన్నికల సమయంలో కొంత వ్యూహరచన చేసి ఉండేవారని, కుంతియా అభ్యర్థుల ఎంపికలో కూడా కొందరి మాటలనే పరిగణనలోకి తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ మార్పుల్లో భాగంగా కుంతియాను తెలంగాణ ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించారు. ఇది ఎప్పడో జరగాల్సింది. ఇప్పటికే బాగా లేటయిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కుంతియా తెలంగాణ రాజకీయాలకు పనికి రాడని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News