భజన చేసే విధము తెలపండి

దేశంలోనే అతి పెద్ద రాజ‌కీయ పార్టీ ఏదైనా ఉంటే అది కేవ‌లం కాంగ్రెస్ మాత్రమే. అయితే, ఇప్పుడు వ‌రుస ఓట‌ముల కార‌ణంగా పార్టీ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది. [more]

Update: 2019-07-30 05:00 GMT

దేశంలోనే అతి పెద్ద రాజ‌కీయ పార్టీ ఏదైనా ఉంటే అది కేవ‌లం కాంగ్రెస్ మాత్రమే. అయితే, ఇప్పుడు వ‌రుస ఓట‌ముల కార‌ణంగా పార్టీ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది. ముఖ్యంగా పార్టీ జాతీయ స్థాయిలో అధ్యక్షుడు, గాంధీల వార‌సుడు రాహుల్ గాంధీ తాజాగా జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మికి బాధ్యత వ‌హిస్తూ.. సాక్షాత్తు ఆయ‌న అధ్యక్ష ప‌గ్గాల‌ను ప‌క్కన పెట్టారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌కు ద‌శ-దిశ చూపించే వారే క‌రువ‌య్యారు. ఇక‌, ఈ క్రమంలోనే రాహుల్‌కు సంఘీభావంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష ప‌దవికి ర‌ఘువీరారెడ్డి కూడా రాజీనామా చేశారు. నిజానికి ఆయ‌న సార‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ కుదురుకోలేదు స‌రిక‌దా.. మ‌రింతగా పార్టీ దిగ‌జారి పోయింది.

పూర్తిగా అభాసుపాలై….

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా అభాసుపాలైంది. ప్రజ‌లు ఈ పార్టీని చీద‌రించారు. అయితే, ఏదో ఒక విధంగా ఎద‌గాల‌ని, ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో పార్టీ గౌర‌వ‌నీయ ప్రతిప‌క్ష స్థాయికి చేరుస్తాన‌ని చెప్పిన ర‌ఘువీరా ఆ విష‌యంలోనూ వెనుక‌బ‌డ్డారు. ఘ‌ర్ వాప‌సీ ప్రక‌టించినా.. ఉన్నవారిని కూడా కాపాడుకోలేని ప‌రిస్థితి ఏర్పడింది. కీల‌క‌మైన నాయ‌కుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి స‌హా అనేక మందిని పార్టీ దూరం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని చెప్పినా.. పోటీ చేసేందుకు నాయ‌కులు క‌రువైన ప‌రిస్థితి కాంగ్రెస్ చ‌విచూసింది.

అది సాకుగా చూపి….

ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఏపీ.. ఇప్పుడు ఆ పార్టీ అంటేనే మండిప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీకి చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరాపై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు వ‌చ్చాయి. ఆయ‌న నాయ‌క‌త్వం వృథా అని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ర‌ఘువీరాపై పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే ఒత్తిడి స‌హ‌జంగానే పెరిగింది. ఇక‌, కేంద్రంలోని రాహులే రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఆయ‌న కూడా అదే అద‌నుగా ప‌ద‌విని వ‌దులుకున్నారు.

తన జోలికి రావద్దంటూ……

నిజానికి పార్టీని ప‌టిష్టం చేయాలంటే. ప‌ద‌వులే అక్కర‌లేదు. అయినా కూడా ర‌ఘువీరా ఇప్పుడు పూర్తిగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నట్టుగా నే క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్టాడుతూ… త‌న‌కు దేవుడిపై మ‌న‌సు మ‌ళ్లింద‌ని, కొన్ని నెల‌ల పాటు దైవ కార్యాల్లో పాలుపంచుకుంటాన‌ని, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆల‌యాలు క‌ట్టించే ప‌నిని చేప‌ట్టాన‌ని, కాబ‌ట్టి త‌న జోలికి ఎవ‌రూ రావొద్దని చెప్పారు. అయితే, ఈ కొన్నాళ్లు అనే మాట‌కు అర్థం నెల‌లా? స‌ంవ‌త్సరాలా? అనే ప్రశ్న స‌శేషంగా మార‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News