రెడీ అయిపోయారు…? ఇప్పటి నుంచే?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నట్లే కన్పిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో రెండేళ్ల గడువు ఉంది. 2022 లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. [more]

Update: 2020-09-13 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నట్లే కన్పిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మరో రెండేళ్ల గడువు ఉంది. 2022 లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలన్నీ ప్రియాంక గాంధీ ఇప్పటికే భుజానకెత్తుకున్నారు. ఆమె మకాం కూడా లక్నోలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునరుజ్జీవం కల్పించేందుకు ప్రియాంక గాంధీ ప్రయత్నిస్తున్నారు.

జిల్లాల నేతలతో….

ఈ మేరకు ఆమె నిత్యం వివిధ జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమవుతున్నారు. జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రియాంక గాంధీ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. వారంలో ఐదు రోజుల పాటు ప్రియాంక గాంధీ పార్టీ కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈసారి ఉత్తర్ ప్రదేశ్ లో విజయం సాధించి చూపెట్టాలన్న లక్ష్యంతో ప్రియాంక గాంధీ పనిచేస్తున్నారు.

బస్సుయాత్రకు…..

ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూతో కలసి ఆమె జిల్లాలను పర్యటిస్తున్నారు. త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్ లో బస్సు యాత్ర చేయాలన్నది ప్రియాంక గాంధీ ఆలోచనగా ఉంది. దీనికి కుటుంబ సభ్యులు, పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో బలపడితే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునే వీలుండటంతో ప్రియాంక గాంధీ ఈ రెండేళ్ల పాటు శ్రమించాలని నిర్ణయించుకున్నారు.

ఏడు కమిటీలతో…..

దీంతో పాటు సీనియర్ నేతలను కూడా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతల నుంచి తప్పించింది. ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేందకు వీలుగా సీనియర్ నేతలు జితిన్ ప్రసాద, రాజ్ బబ్బర్ లను పక్కన పెట్టింది. ఉత్తర్ ప్రదేశ్ లో ఏడు కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ప్రియాంక గాంధీ సూచనలతోనే ఈ ఏడు కమిటీలను నియమించింది. ఇందులో తమకు నమ్మకమైన వారికే చోటు కల్పించింది. ఇటీవల సోనియా గాంధీకి రాసిన లేఖలో సంతకం ఉన్నవారెవ్వరికీ కమిటీలో చోటు కల్పించకపోవడం విశేషం. నమ్మకమైన నేతలనే ఇకపై కాంగ్రెస్ రాజకీయంగా ప్రోత్సహించదలచుకుందన్నది స్పష్టమయింది.

Tags:    

Similar News