లాక్ డౌన్… లాక్ డౌన్.. మళ్లీ షట్ డౌన్

కరోనా కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. పదిహేను లక్షలకు దాటేశాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ తో విలవిలలాడుతున్నాయి. అన్ లాక్ 2లో ప్రస్తుతం లాక్ [more]

Update: 2020-07-25 18:29 GMT

కరోనా కేసులు భారత్ లో పెరుగుతున్నాయి. పదిహేను లక్షలకు దాటేశాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ తో విలవిలలాడుతున్నాయి. అన్ లాక్ 2లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జరుగుతుండటం విశేషం. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మరో మూడు నాలుగు నెలల పాటు ఉధృతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే కోట్లాది మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశముందని అనేక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

వైద్యం అందించలేక…..

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ బాధితులకు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స అందించలేక చేతులెత్తేస్తున్నాయి. కొన్ని ఇప్పటికే ప్రయివేటు ఆసుపత్రులను కూడా భాగస్వామ్యులను చేశాయి. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలే కరోనా కట్టడికి తమ వంతు ప్రయత్నాలు చేయడం ప్రారంభించాయి.

అనేక రాష్ట్రాలు…..

ప్రస్తుతం అనేక రాష్ట్రాలు లాక్ డైన్ ను పాటిస్తున్నాయి. కర్ణాటకలో ఈ నెల 22 వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించారు. కేసుల సంఖ్య పెరుగుతుండమే ఇందుకు కారణం. అలాగే ఉత్తర్ ప్రదేశ్ లోనూ లాక్ డౌన్ విధిస్తున్నారు. వీకెండ్స్ లో ఉత్తర్ ప్రదేశ్ లో లాక్ డౌన్ ను విధిస్తున్నారు. ఇక కేసులు తీవ్రత ఎక్కువగా ఉన్న బీహార్ రాష్ట్రం సయితం ఈ నెల 31వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించింది. ఇక మహారాష్ట్ర సంగతి చెప్పాల్సిన పనిలేదు. పూనే నగరంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంది.

కేసులు పెరుగుతుండటంతో….

మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో రెండున్నర లక్షలు కరోనా పాజిటివ్ కేసులు దాటాయి. తమిళనాడులో లక్షన్నరకు చేరువలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎదురు చూడకుండా రాజకీయంగా భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లను అమలు చేస్తున్నాయి.

Tags:    

Similar News