లాక్ డౌన్ తప్పదా..? అప్పుడే ఆ ప్రకటన చేస్తారా?

భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్స్ [more]

Update: 2021-04-25 17:30 GMT

భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతతో పాటు మందుల కొరత కూడా అనేక రాష్ట్రాల్లో ఇబ్బందిగా మారింది. దీనిని అధిగమించేందుకు లాక్ డౌన్ విధించడమే మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మే రెండో వారంలో రోజుకు పది లక్షల కేసులు నమోదవుతాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే….

దీంతో మోదీ ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. వారం రోజులు లాక్ డౌన్ ను ప్రకటించినా కొనసాగించక తప్పదంటున్నాయి. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఇక అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి.

పరిస్థితులను బట్టి…..

లాక్ డౌన్ నిర్ణయం ఈసారి రాష్ట్ర ప్రభుత్వాలకే మోదీ వదిలేశారు. అక్కడ పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించారు. కానీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లేకుండా కరోనా నియంత్రణ సాధ్యం అయ్యేలా కన్పించడం లేదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాకపోకలు ఉంటే వైరస్ నియంత్రణ సాధ్యం కాదని నిపుణులు సయితం హెచ్చరిస్తున్నారు. దీనిపై మోదీ సయితం అందరి అభిప్రాయాలు సేకరించే పనిలో ఉన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత…?

అయితే మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫలితాల తర్వాత లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయని ప్రచారం మాత్రం జరుగుతుంది. ఆ దిశగానే మోదీ ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తోంది. మే జూన్ నెలలకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం, గోధుమలను పంపిణీ చేయాలని నిర్ణయించడం వెనక కూడా ఇదే కారణమని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించకుంటే భారత్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశముందంటున్నారు. ఈలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు

Tags:    

Similar News