కర్నూలులో ఆగుతుందా? కల్లోలం రేపుతోందా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం రేపుతోంది. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో కర్నూలు జిల్లా హాట్ స్పాట్ గా మారింది. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు అమాంతంగా పెరగడానికి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం రేపుతోంది. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో కర్నూలు జిల్లా హాట్ స్పాట్ గా మారింది. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు అమాంతంగా పెరగడానికి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం రేపుతోంది. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో కర్నూలు జిల్లా హాట్ స్పాట్ గా మారింది. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు అమాంతంగా పెరగడానికి గల కారణాలు మర్కజ్ మసీదు ప్రార్థనలేనన్నది వాస్తవం. కర్నూలు జిల్లా నుంచి మర్కజ్ మసీదుకు దాదాపు 400 మందికి పైగానే వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వారిలో 350 మందిని ఇప్పటి వరకూ కనుగొన్నారు. వారిని క్వారంటైన్ కు పంపారు. వారితో సంబంధం ఉన్న వారిని సయితం ఐసొలేషన్ కు తరలించారు.
పంపిన రిపోర్టులలో…..
ఇప్పటివరకూ కర్నూలు జిల్లా నుంచి 363 రిపోర్టులు ల్యాబ్ కు పంపగా అందులో 74 కరోనా పాజిటివ్ గా నమోదయ్యాయి. మరో 70 వరకూ రిపోర్టులు రావాల్సి ఉందంటున్నారు. ఇప్పటికే ఏపీలో కర్నూలు జిల్లా కరోనా వైరస్ లో టాప్ పొజిషన్ లో ఉంది. దీంతో అధికారులు కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ లుగా గుర్తించారు. హాట్ స్పాట్ లను గుర్తించి అక్కడ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
హాట్ స్పాట్ లను గుర్తించి…..
హాట్ స్పాట్ ప్రాంతాల్లో మెడికల్ షాపులు మినహా మరే దుకాణం తెరిచేందుకు వీలు లేదని అధికారులు ఆంక్షలు విధించారు. నిత్యావసరాల వస్తువులకు వారి ఇళ్లకు అందించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 15 క్వారంటైన్లను సిద్ధం చేశారు. నంద్యాల, కర్నూలు, కోడుమూరు ప్రాంతాల్లో క్వారంటైన్ లను ఏర్పాటు చేశారు. వీటిలో 1600 పడకలను సిద్ధం చేశారు. కేసులు నమోదు తీవ్రత ఎక్కువైనా ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వారి జాడ తెలియకపోవడంతో….
మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు మరో 40 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరిలో కొందరు అడ్రస్ లు తప్పుగా ఇచ్చారు. ఫోన్ లు కూడా స్విచాఫ్ చేసి ఉన్నాయి. వారు ఢిల్లీ నుంచి కొందరు తిరిగి రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే వీరి కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి జరపనున్న సర్వేలో వీరి విషయాలు బయటపడే అవకాశముంది. మొత్తం మీద కరోనా పాజిటివ్ కేసులు కర్నూలు లో పెరుగుతుండటంతో జిల్లాపై అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. అన్ని చర్యలు తీసుకుంటుంది.