గజగజలాడుతున్న పోలీసులు…ఇదేం ఖర్మ?

తెలంగాణలో పోలీసులను కరోనా కలవరపెడుతుంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ముందున్న పోలీసులను మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికి తెలంగాణాలో 190 మందికి పైగా పోలీసులు వైరస్ బారిన [more]

Update: 2020-06-22 09:30 GMT

తెలంగాణలో పోలీసులను కరోనా కలవరపెడుతుంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ముందున్న పోలీసులను మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికి తెలంగాణాలో 190 మందికి పైగా పోలీసులు వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఉన్నతాధికారులనుంచి హోమ్ గార్డ్ వరకు ఉండటం ఆందోళనకలిగిస్తుంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్య సిబ్బంది కన్నా రోడ్లపైన కీలకమైన ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉంటున్న పోలీసులే ఎక్కువగా బాధితులు అయ్యారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు …

పోలీసులపై కరోనా రక్కసి విరుచుకుపడడంతో టి సర్కార్ కూడా అందుకు అనుగుణంగా వారికి చికిత్స పై దృష్టి పెట్టింది. పోలీసులకు కరోనా సోకితే వారికి వైద్యం అందించేందుకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అయితే సౌకర్యాలు ఇక్కడ సరైన రీతిలో లేవనే కారణంతో పాటు వైద్య ఖర్చులు కు రీ ఎంబర్స్మెంట్ లేకపోవడంతో పోలీసులు ఎక్కువమంది హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.

వారినుంచి వైరస్ …

తెలంగాణాలో ఇప్పటికి ఏడుగురి ఐపీఎస్ లకు కరోనా అటాక్ అయ్యింది. వీరికి ఇది సోకడానికి వారివద్ద పనిచేసే గన్ మెన్లు, వాహన డ్రైవర్లు, వ్యక్తిగత సహాయక సిబ్బంది నుంచి వచ్చినట్లు గుర్తించి తెలంగాణ డిజిపి కార్యాలయం, కమిషనరేట్ లలో పెద్ద ఎత్తున టెస్ట్ లు చేయిస్తున్నారు. పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. వైరస్ కంట్రోల్ లో కీలకంగా వ్యవహరిస్తున్నఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇలా మహమ్మారి బారిన పడుతూ ఉండటంతో విధుల్లో పాల్గొనడానికి భయపడుతూనే వెళ్ళలిసి వస్తుంది పోలీసులకు.

Tags:    

Similar News