కర్నూలును వీడని కరోనా… భయపెడుతుందిగా?
కరోనా వైరస్ కర్నూలు జిల్లాను వీడేట్లు లేదు. తొలినుంచి కర్నూలు జిల్లాను కరోనా వైరస్ ఇబ్బంది పెడుతూనే ఉంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదయిన జిల్లాగా కర్నూలు [more]
కరోనా వైరస్ కర్నూలు జిల్లాను వీడేట్లు లేదు. తొలినుంచి కర్నూలు జిల్లాను కరోనా వైరస్ ఇబ్బంది పెడుతూనే ఉంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదయిన జిల్లాగా కర్నూలు [more]
కరోనా వైరస్ కర్నూలు జిల్లాను వీడేట్లు లేదు. తొలినుంచి కర్నూలు జిల్లాను కరోనా వైరస్ ఇబ్బంది పెడుతూనే ఉంది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదయిన జిల్లాగా కర్నూలు గతంలో రికార్డులకు కెక్కింది కూడా. కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిపై గతంలో రాజకీయ దుమారం కూడా చెలరేగింది. గత కొంతకాలంగా కర్నూలు జిల్లా పెద్దగా వార్తలకు ఎక్కడం లేదు. అక్కడ కరోనా వ్యాప్తి సాధారణమయినట్లు అందరికీ అనిపించడమే అందుకు కారణం.
తొలుత లైట్ గా తీసుకున్నా …..
కర్నూలు జిల్లాలో తొలి కేసు మార్చి నెలలో నమోదయింది. తొలుత లైట్ గా తీసుకున్న అధికార యంత్రాంగం ఆ తర్వాత రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 1050 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు తర్వాత స్థానంలో కృష్ణా, గుంటూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలున్నాయి.
మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి….
మర్కజ్ మసీద్ ప్రార్థనల తర్వాత కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఏపీలోనే అత్యధికంగా మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య కర్నూలు జిల్లాలోనే ఉంది. దాదాపు వెయ్యి మందికి పైగానే మర్కజ్ మసీద్ ప్రార్థనలకు వెళ్లారు. వీరందరిని గుర్తించడం అధికారులకు తొలుత కష్టసాధ్యమయింది. రాజకీయ జోక్యం కూడా పెరగడంతో కొన్ని ఆరోపణలను కూడా అధికారులు ఎదుర్కొన్నారు. అయినా చివరకు వారిని గుర్తించి క్వారంటైన్ కు పంపగలిగారు.
అధికారులను మార్చినా…..
కర్నూలు జిల్లాలో కేసులు ఎక్కువవుతుండటంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. మున్సిపల్ కమిషనర్ ను కూడా మార్చివేసింది. ఇంత చేసినా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంలేదు. ఇటీవల ఒక్కరోజే 60 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గించింది. అయితే లాక్ డౌన్ నిబంధనల్లో ఎక్కువగా మినహాయింపులు ఇవ్వడంతో కర్నూలు జిల్లాలో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.