భయం గుప్పిట్లో కోనసీమ.. కారణం ఇదే

కరోనా వచ్చిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల కన్నా బాగా తక్కువ కేసులు తో నెట్టుకొచ్చింది తూర్పుగోదావరి జిల్లా. అయితే ఇప్పుడు ఎపి లో కర్నూలు [more]

Update: 2020-07-17 11:00 GMT

కరోనా వచ్చిన కొత్తలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల కన్నా బాగా తక్కువ కేసులు తో నెట్టుకొచ్చింది తూర్పుగోదావరి జిల్లా. అయితే ఇప్పుడు ఎపి లో కర్నూలు తరువాత 2వేల751 మంది పాజిటివ్ కేసులతో రెండో స్థానం లో కరోనా దూసుకురావడంతో జిల్లా వాసులు హడలి పోతున్నారు. తొలుత విదేశాల నుంచి ఆ తరువాత తబ్లీగి కాంటాక్ట్స్, తదనంతరం కోయంబేడు కాంట్రాక్ట్ కేసులతో మొదలైన తూర్పుగోదావరి లో కరోనా కాలు పెట్టింది. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ కేసులు తగ్గుముఖం పట్టి రెడ్ జోన్స్ ఎత్తివేసిన తరువాత ఒక్కసారిగా వైరస్ విజృంభించింది. ఈ పరిణామాలు అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా కలవరపాటుకు గురి చేసి లాక్ డౌన్ చర్యలు మొదలయ్యాయి.

లాక్ డౌన్ నిబంధనలు సడలించాకే …

తూర్పు గోదావరి జిల్లా లో భారీగా వైరస్ వ్యాప్తికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారి జిల్లా అంతా వ్యాప్తి కలిగి ఉండటం, చెన్నై, హౌరా రైలు మార్గం జిల్లా మీదుగా వెళ్లడంతో పాటు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ రాజమండ్రిలో, నౌకాశ్రయం కాకినాడలో ఉండటంతో వ్యాపార కార్యక్రమాలు జోరుగా సాగుతుంటాయి. నిత్యం లక్షలమంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దాంతో కేసుల సంఖ్య కట్టడికి ఎంత కృషి చేసినా ఫలితం కనిపించడం లేదు. ఫలితంగా అధికారులు ఉదయం 6 గం నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలకు అనుమతి ఇచ్చారు.

టెస్ట్ ల సంఖ్యా ఎక్కువే …

ఏపీ సర్కార్ కరోనా టెస్ట్ ల సంఖ్యను బాగా పెంచింది. సంజీవిని పేరిట ఆర్టీసీ ఇంద్రా బస్సులను తూగో జిల్లాకు మూడు కేటాయించింది. ఒక్కో బస్సు ద్వారా రోజుకు వెయ్యి టెస్ట్ లు చెయ్యాలని సర్కార్ లక్ష్యం నిర్ణయించింది కూడా. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్యా భారీగానే బయటపడుతుంది. రోజుకు తూర్పు గోదావరి జిల్లాలో సుమారు ఐదువందల మంది పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వైద్య విభాగం తీవ్ర వత్తిడికి గురౌతుంది. దాంతో క్వారంటైన్ సౌకర్యాలు, వైద్య సాయం సమస్య గా మారింది. కొన్ని చోట్ల సౌకర్యాలు సరిగ్గా లేవంటూ రోగులు ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. జిల్లా వాసులు స్వీయ రక్షణ చర్యలు తీసుకుని వైరస్ ను ఎదుర్కోవాలని ప్రభుత్వం చేయాలిసినంతా చేస్తుందని మరోపక్క చెబుతుంది. అయితే రాజమండ్రి నుంచి కాకినాడ, కోనసీమ వరకు జనం భయం గుప్పిట్లోనే అల్లాడుతున్నారు.

Tags:    

Similar News