కర్నూలు ను అలా వదిలేయాల్సిందేనా?

కర్నూలులో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. వరసగా కేసుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా కర్నూలులో మాత్రం కరోనా వైరస్ కంట్రోల్ [more]

Update: 2020-05-25 17:30 GMT

కర్నూలులో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. వరసగా కేసుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా కర్నూలులో మాత్రం కరోనా వైరస్ కంట్రోల్ కావడం లేదు. ఏదో ఒక రూపంలో వచ్చి కర్నూలును కరోనా అతలాకుతలం చేస్తుంది. ఇక్కడ రాజకీయ ఆరోపణలు కూడా తీవ్రమయ్యాయి. వైసీపీ నేతల కారణంగానే కరోనా వ్యాప్తి చెందుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తొలి నుంచి అంతే…

కరోనా వైరస్ తొలి నుంచి ఏపీలో కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా కన్పించింది. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి తొలుత కర్నూలు జిల్లాను వణికించింది. వారిని గుర్తించి పట్టుకోవడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. దాదాపు ఏడు వందలకు మందికి పైగా కర్నూలు జిల్లా నుంచి మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చారు. వీళ్లు ఫోన్లు కూడా స్విచాఫ్ చేయడంతో తొలుత గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. ప్రజలు కూడా వీరి సమాచారాన్ని తెలియజెప్పలేదు.

వారిని గుర్తించినా….

తర్వాత కరోనా వైరస్ తీవ్రత చూసిన తర్వాత ప్రజలు సహకరించడం మొదలుపెట్టారు. మొత్తం మీద మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని అందరినీ అధికారులు గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎక్కువగా నంద్యాల, కర్నూలు పట్టణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కొంత కంట్రోలు అవుతుందనుకుంటున్న సమయంలో కోయంబేడు మార్కెట్ కూడా కర్నూలును తగులుకుంది. ఆదోని తదితర ప్రాంతాల నుంచి కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చి కరోనాను తెచ్చినట్లు అధికారులు గుర్తించారు.

కేంద్ర బృందం సయితం…

కేంద్ర బృందం కూడా కర్నూలు లో పరిస్థితిని సమీక్షించింది. ఇక్కడ కర్నూలు టౌన్ దాదాపుగా రెడ్ జోన్ లో ఉన్నట్లే. కర్నూలు టౌన్ కు ఆర్టీస బస్సులు కూడా ప్రభుత్వం నడపలేని పరిస్థితి. ఇక్కడ లాక్ డౌన్ మినహాయింపులు ఎలాంటివి ఇవ్వలేదు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 700కు చేరుకున్నాయి. మున్సిపల్ కమిషనర్ ను ప్రభుత్వం మార్చినప్పటికీ కరోనా విషయంలో ఎలాంటి మార్పులేదు. ప్రత్యేక అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. అయినా కేసులు మాత్రం ఆగడం లేదు. మరి ఏపీ ప్రభుత్వానికి కర్నూలు తలనొప్పిగా మారింది.

Tags:    

Similar News