అవును ఇది నిజం… ఇప్పటికైనా మారితే మంచిది…?

కరోనా కు ముందు… కరోనా తరువాత అనేది ఖచ్చితంగా ప్రపంచంలో మొదలు అవుతుంది. ఎన్నడూ ఎదుర్కొని విపత్తుపై అందరు యుద్ధం చేస్తున్నారు. వైరస్ పై వార్ లో [more]

Update: 2020-04-02 12:30 GMT

కరోనా కు ముందు… కరోనా తరువాత అనేది ఖచ్చితంగా ప్రపంచంలో మొదలు అవుతుంది. ఎన్నడూ ఎదుర్కొని విపత్తుపై అందరు యుద్ధం చేస్తున్నారు. వైరస్ పై వార్ లో అనేక గుణపాఠాలు చెప్పకనే చెబుతున్నాయి. విశ్వనగరాలు గా ప్రపంచంలో భాసిల్లినవే ప్రస్తుతం వైరస్ కి తల వంచాయి. వుహాన్ నుంచి న్యూయార్క్ వరకు ఇటలీ, లండన్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్. మహా నగరాల్లో అలాగే మన దేశానికి వస్తే ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్ వంటివి వైరస్ కి చిక్కుల్లో అత్యధికంగా విలవిల్లాడుతున్నాయి.

చిన్న పట్టణాలే శ్రీరామ రక్ష…

ఐదు లక్షలకు జనాభా మించని పట్టణాలు దేశంలో విస్తరించకుండా చూసుకోవాలని 70వ దశకంలో రైతు బాంధవుడిగా పేరొందిన చరణ్ సింగ్ హెచ్చరించిన అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవుతుంది. అవును మహా నగరాలుగా విస్తరిస్తే సంక్షోభ సమయాల్లో కానీ ప్రకృతి విపత్తుల్లో కానీ యుద్ధ సమయాల్లో కానీ వాటికి సాయం అందించడం దేవుడెరుగు కనీసం తాగునీటిని, ఆహారాన్ని అందించడం అత్యంత కష్టం. అనేక సందర్భాల్లో ఇది రుజువయింది కూడా. విపరీత జనసమ్మర్దమే నేడు న్యూయార్క్ కొంప ముంచింది. నిద్ర ఎరుగని మహానగరంగా న్యూయార్క్ అలాగే ఇదే మాట మన దేశంలో ముంబాయికి వుంది. ఈ రెండు నగరాలు అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసుల్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న లెక్కలు చూస్తే విశ్వనగరాలు ఏ మాత్రం శ్రేయస్కరం కావన్న చర్చ మొదలైంది.

గ్రామాలు చిన్న పట్టణాలు చూస్తే …

భారత్ ను పరిశీలిస్తే కోవిడ్ కట్టడిలో ఇప్పుడు దేశంలో గ్రామాలు ఆ తరువాత చిన్న పట్టణాలే ముందు వరసలో వున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో పాలకులు అభివృద్ధి వికేంద్రీకరణ తో బాటు పెద్ద నగరాలు విశ్వనగరాలవైపు దృష్టి పెట్టకుండా ముందుకు సాగాలన్న సందేశం కోవిడ్ ఇచ్చేసింది. ఇప్పటికే ఒక హైదరాబాద్ నగరాన్ని పరిశీలిస్తే విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో లాక్ డౌన్ ఇంకా పూర్తి కాకుండానే నిత్యావసర వస్తువులు నిండుకుంటున్నాయి. పాలు ఇతర సరుకులు ఇతర రాష్ట్రాలు ప్రాంతాలనుంచి దిగుమతి అయితే కానీ ఇక్కడ ముద్ద దిగదు. లాక్ డౌన్ ఏప్రిల్ 14 దాటి కొనసాగితే దేశంలో విశ్వనగరాలుగా భాసిల్లుతున్న సిటీల్లోని ప్రజల కష్టాలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయనే నిపుణుల అంచనా. ఎపి లో జగన్ సర్కార్ ఒకే చోట అభివృద్ధి భవిష్యత్తులో చిక్కులు తెస్తాయన్న శివరామ కృష్ణన్ కమిటీ ఇతర కమిటీల సూచనల పేరుతో మూడు ప్రాంతాల అభివృద్ధిపై అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే అన్నది కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది.

Tags:    

Similar News