డొల్లతనం బయటపడుతుందా …?

వైరస్ కట్టడిలో ఉత్తరాదికన్నా దక్షిణాది రాష్ట్రాలు అద్భుతంగా పని చేస్తున్నాయి. మెజారిటీ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను పాటించడం వల్లే ఇది సాధ్యం అయ్యిందని స్పష్టం [more]

Update: 2020-05-16 09:30 GMT

వైరస్ కట్టడిలో ఉత్తరాదికన్నా దక్షిణాది రాష్ట్రాలు అద్భుతంగా పని చేస్తున్నాయి. మెజారిటీ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను పాటించడం వల్లే ఇది సాధ్యం అయ్యిందని స్పష్టం అవుతుంది. అయితే ఒక్క తమిళనాడు తప్ప కేరళ, కర్ణాటక, ఎపి, తెలంగాణ, లలో వైరస్ ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగానే అణచివేయగలిగాయి. కానీ కేంద్రం లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి రాష్ట్రాలకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా వలస కూలీలు, ఇతర రాష్ట్రాలకు నిత్యవసరాలు తీసుకువెళ్లివచ్చే లారీ డ్రైవర్లు కరోనా వాహకులుగా మారిపోయారు. వీరికి నిర్వహిస్తున్న టెస్ట్ ల ఫలితాలు ఇవి తేటతెల్లం చేస్తున్నాయి.

ఆ రాష్ట్రాలనుంచి వచ్చేవారు యమ డేంజర్ …

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు ప్రాంతాలనుంచి వచ్చే వారిలో ఎక్కువమంది కరోనా వైరస్ కు గురయి వస్తున్నారు. వ్యక్తిగత నిర్లక్ష్యం కావొచ్చు, ఆ రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువ గా ఉండటంతో కావొచ్చు ఎపి, తెలంగాణ లకు వచ్చేవారు పాజిటివ్ కేసులుగా నమోదు అవుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. రైళ్లనుంచి వచ్చే వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లో బయల్దేరే సమయంలో టెస్ట్ లు నిర్వహించి వారికి చికిత్స అందించేందుకు అక్కడి ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుంది అన్నది తెలుగు రాష్ట్రాల్లో అధికారులు భావిస్తున్నారు. వేరే రాష్ట్రానికి వెళ్లేముందు పూర్తి పరీక్షలను ఎందుకు చేసి పంపడం లేదని వారు అలా చేయడం వల్ల రైళ్లల్లో ప్రయాణించే ఇతర వ్యక్తులకు వ్యాధి సోకే ప్రమాదం ఉండటంతోపాటు, రైల్వే సిబ్బంది, పోలీస్ సిబ్బంది కి ప్రమాదం వాటిల్లుతుందని గుర్తెరగకపోతే ఎలా అన్నది ప్రశ్న.

కేంద్రం చర్యలు చేపట్టాలి…

దీనితోపాటు వైరస్ కట్టడికి తెలుగు రాష్ట్రాల్లో వైద్యబృందాలు రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేస్తుంటే వారి పై వత్తిడి మరింత పెరుగుతుందన్న ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటె రైళ్లల్లో వచ్చే వారికి టెస్ట్ లు చేయాలని తెలుగు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయినప్పటికీ ఒక పక్క కోయంబేడు వెళ్లివచ్చిన వారు, వలసకూలీలు, ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్న వారితో కేసుల సంఖ్య వెల్లువలా పెరిగిపోతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కఠినమైన నిబంధనలు పెట్టి వైరస్ లేని వారినే ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News