మళ్లీ మొదలయింది… భయపెడుతుందిగా

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వీడటం లేదు. తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మే 29వ తేదీ వరకూ కరోనా వైరస్ [more]

Update: 2020-08-01 17:30 GMT

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వీడటం లేదు. తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మే 29వ తేదీ వరకూ కరోనా వైరస్ అమెరికాను ఊపిరి తీసుకోనివ్వలేదు. రోజుకు నలభై వేల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కొంత కేసులు తగ్గుముఖం పట్టాయి. పరీక్షల సంఖ్యను పెంచడమే కాకుండా నిబంధనలను కఠినతరం చేయడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.

మరోసారి కేసుల సంఖ్య….

అయితే మళ్లీ అమెరికాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ఏ ఏడాది జనవరి నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ మార్చి నేటికి ప్రపంచమంతా విస్తరించింది. ఇందులో దారుణంగా ఎఫెక్ట్ అయింది ఒక్క అమెరికా మాత్రమే. కరోనా వైరస్ ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు అమెరికాలోనే సంభవించాయి. దీంతో కరోనా అమెరికా రాజకీయల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అధ్యక్ష్య ఎన్నికలు ఉండటంతో వైరస్ ఎవరి కొంపముంచనుందో నన్న టెన్షన్ ఊపందుకుంది.

నెల రోజుల నుంచి….

దీంతో గత నెల రోజుల నుంచి కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా కొద్ది రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా టెక్సాస్, నెవడా, అల్బామా రాష్ట్రాల్లో ఎక్కువ కేసులునమోదవుతుండటమే కాకుండా, ఇక్కడే అత్యధికంగా మరణాలు సంభవించాయి. దీంతో ఆ యా రాష్ట్రాల్లో మళ్లీ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించారు.

లక్షల్లో మృతులు….

అమెరికాలో మరణాల సంఖ్య పెరుగుతుండటం, అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వెయిటింగ్ చేయాల్సి వస్తోంది. ఒక్కొక్క శ్మశాన వాటికలో దాదాపు రెండు వారాల పాటు వెయిటింగ్ లిస్ట్ లో ఉంచుతున్నారు. అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 41 లక్షల వరకూ చేరుకుంది. కరోనా బారిన పడి దాదాపు 1.50 లక్షల మంది మరణించారు. ఇప్పటికీ దాదాపు 30 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరి అమెరికా కరోనా బారిన నుంచి ఇప్పట్లో కోలుకుంటుందా?

Tags:    

Similar News