కరోనాను ఇక లైట్ తీసుకోవడమే బెటరా?
కరోనా వైరస్ ధోరణి వైద్య వర్గాలకు సైతం షాక్ ఇస్తుంది. ఇప్పటివరకు ఎపి లో వచ్చిన కేసుల్లో 80 శాతం ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా ఉన్న [more]
కరోనా వైరస్ ధోరణి వైద్య వర్గాలకు సైతం షాక్ ఇస్తుంది. ఇప్పటివరకు ఎపి లో వచ్చిన కేసుల్లో 80 శాతం ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా ఉన్న [more]
కరోనా వైరస్ ధోరణి వైద్య వర్గాలకు సైతం షాక్ ఇస్తుంది. ఇప్పటివరకు ఎపి లో వచ్చిన కేసుల్లో 80 శాతం ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా ఉన్న వారిలో పాజిటివ్ రావడం గమనిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్నారు. ఇలా లక్షణాలు లేకుండా ఉంటే వ్యాధిగ్రస్తులను గుర్తించడం కష్టసాధ్యం అవుతుంది వైద్యులకు. ముఖ్యంగా టెస్ట్ ల విషయంలో ఎవరికి చేయాలి ఎవరికి అవసరం లేదన్నది తెలియక సతమతం అవుతున్నారు వైద్య బృందాలు. ఈ అంశాలన్ని కేంద్రం బృందం ముందు పెట్టి వాపోయింది రాష్ట్ర నిపుణుల బృందం.
ఎలా మరి …?
ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ కట్టడి ఎలా అన్నదే ఇప్పుడు వారి బుర్రలు బద్దలు కొట్టేస్తుంది. వాస్తవానికి టెస్ట్ ల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో చేస్తుంది. అందువల్లే కేసుల సంఖ్య పెరుగుతుంది అన్నది ఎపి ప్రభుత్వం చెబుతున్న అంశం. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఇప్పుడు టెస్ట్ లు ఎవరికి చేసి ఫలితం రాబట్టాలన్న విషయంలో కేంద్ర వైద్య నిపుణుల బృందం కూడా సరైన సూచనలు, సలహాలు ఇవ్వలేని వాతావరణం ఏర్పడింది. దాంతో కంటైన్మెంట్ లో ఉండేవారికి అత్యధికంగా పరీక్షలు చేయాలన్న సూత్రం తోనే ముందుకు వెళ్ళలిసి వస్తుంది.
సావాసం … సంసారం దాంతోనే …
రాబోయే రోజుల్లో కూడా వ్యాక్సిన్ వచ్చేవరకు వైరస్ తో సహజీవనం తప్పదని తేల్చి అందరికన్నా ముందే చెప్పేశారు ఎపి సిఎం జగన్. ఈ వ్యాఖ్యలపై వివిధవర్గాలు విపక్షాలనుంచి పెద్ద ఎత్హునే విమర్శలు చెలరేగాయి. అయితే అదే వాస్తవం అన్నది ప్రధాని నుంచి పలువురు ముఖ్యమంత్రుల వరకు చెప్పిన తరువాత జగన్ వ్యాఖ్యలను ఇప్పుడిప్పుడే అంతా అర్ధం చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తాను రోజు టెస్ట్ చేయించుకుంటా అని ప్రకటించారు అంటే కరోనా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ప్రపంచాన్ని చుట్టుముట్టిందో చెప్పకనే చెప్పేసింది. దీనికి భయపడి ఇంట్లో కూర్చుని నెలల తరబడి ఉండే కన్నా చేతులు పరిశుభ్రం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చిన్నపాటి చిట్కాలతో వైరస్ పై యుద్ధం చేయడం ప్రజలకు తప్పదన్నది తేలిపోయింది.