తగ్గినా ఎక్కేది ఆయనే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సుదీర్ఘకాలం [more]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సుదీర్ఘకాలం [more]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సుదీర్ఘకాలం తర్వాత అధికారం కోసం తీవ్రంగా శ్రమించిన బీజేపీ ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం కష్టసాధ్యంగానే కనపడుతుంది. అయితే గత ఎన్నికల కంటే కొంత మెరుగైన ఫలితాలు సాధించే వీలుంది. తప్ప అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా.
గతంలో కంటే తగ్గినా…..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కేజ్రీవాల్ ఎన్నిక తథ్యమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 36 గా ఉంది. కేజ్రీవాల్ పార్టీ నలభై నుంచి యాభై స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నట్లు అంచనా. గతంలో కేజ్రీవాల్ పార్టీకి 67 స్థానాలు వచ్చాయి. అయితే ఈసారి ఆ మెజారిటీ తగ్గనుంది. బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతోనే కేజ్రీవాల్ పార్టీకి మెజారిటీ తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో….
భారతీయ జనతా పార్టీ ఆశలు ఈ ఎన్నికల్లో నెరవేరేలా కన్పించడం లేదు. ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు, ఎంపీలు పదుల సంఖ్యలో మొహరించినా ఫలితం లేదన్నది తేలిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ నే ఎంచుకోవాలని నిర్ణయించుకోవడంతో గతంలో వచ్చిన మూడు స్థానాల కంటే ఈసారి మరో ఏడు వరకూ పెరిగే అవకాశముంది. పార్లమెంటు ఎన్నికల్లో స్వీప్ చేసినా ఈ ఎన్నికల్లో మాత్రం అది కుదరదని దాదాపుగా తేలిపోయింది.
ఎగ్జిట్ పోల్స్ ను నమ్మమంటూ…
ఇక కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోయిందంటున్నారు. బలహీనమైన అభ్యర్థులను పోటీ చేయించడమే ఇందుకు కారణం. అయితే ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మేది లేదని కాంగ్రెస్ అంటుంది. గతంలో హర్యానా ఎన్నికల్లో మూడు సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జట్ పోల్స్ వెల్లడించాయని, తమకు 31 సీట్లు వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. జార్ఖండ్ తరహా ఫలితాలు వస్తాాయని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కానీ కేజ్రీవాల్ విజయం దాదాపు ఖాయమని, ఒంటరిగానే ఆయన అధికారంలోకి వస్తారని గట్టిగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరికొద్ది గంటల్లో ఢిల్లీ పీఠం ఎవరిదనేది తేలిపోతుంది.