ఆ విష‌యంలో జాగ్రత్త పడాల్సిందే.. వైసీపీలో ఇదో హాట్ టాపిక్

`రాష్ట్రంలో మా ప్రభుత్వం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాలు.. జాతీయ‌స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ విష‌యంలో అనేక రాష్ట్రాలు ఇస్తున్న కితాబులు తెలిసిందే. కానీ, ఆ [more]

Update: 2021-06-24 02:00 GMT

'రాష్ట్రంలో మా ప్రభుత్వం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాలు.. జాతీయ‌స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ విష‌యంలో అనేక రాష్ట్రాలు ఇస్తున్న కితాబులు తెలిసిందే. కానీ, ఆ ఒక్క విష‌యంలోనే మేం జాగ్రత్తగా ఉంటే స‌రిపోతుంది“- ఇదీ.. వైసీపీ నేత‌లు అంటున్న మాట‌. అంతేకాదు.. టీడీపీ స‌హా ప్ర‌తిప‌క్షాల ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వారు ఏమ‌న్నా అదంతా రాజ‌కీయ సాధింపుల్లో భాగ‌మేన‌ని అంటు న్నారు. మ‌రి.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన విష‌యం ఏంటి? అనేది ఆస‌క్తిగామారింది.

న్యాయస్థానాల నుంచి….?

ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కొంద‌రు వైసీపీ నేత‌లు.. ఈ విష‌యంలో గుంభ‌నంగా ఉంటే.. మ‌రికొంద‌రు మాత్రం బ‌య‌ట ప‌డుతున్నారు. న్యాయ‌ప‌రంగా పార్టీకి ఎదుర‌వుతున్న చిక్కుల నుంచి తాము బ‌య‌ట‌ప‌డితే చాల‌ని చెబుతున్నారు. సీఎంగా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వ‌ర‌కు వివాదం అయ్యాయి. కోర్టులు అనేక నిర్ణయాలను కొట్టేశాయి. వీటిన‌లో పంచాయ‌తీ కార్యాల‌యాల‌కు రంగులు వేయ‌డం స‌హా.. ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టడం వంటివి కోర్టులు తోసిపుచ్చాయి. దీంతో వైసీపీ స‌ర్కారుపై వ్యతిరేక‌త వ్యక్తమైంద‌నే భావ‌న ఉంది.

వ్యవస్థలతోనే యుద్ధం…..

ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌ల విష‌యంలో నిమ్మగ‌డ్డ ర‌మేష్‌కు వైసీపీ ప్రభుత్వానికి మ‌ధ్య యేడాది కాలంగా పెద్ద యుద్ధమే న‌డిచింది. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిర‌గడం, కోర్టుల్లో కేసులు వేయ‌డం, వ్యవ‌స్థల‌తో ఫైట్ చేయ‌డంతోనే పొద్దు వెల్లబుచ్చుతుంటే ఇక పాల‌న‌పై దృష్టి పెట్టే టైం ఎక్కడ ఉంటుంది అన్న భావ‌న సామాన్య ప్రజల్లో కూడా వ్యక్తమ‌వుతోంది. ఇదే ప్రతిప‌క్షాల‌కు వ‌రంగా మారుతోంది. ఇదే అంశాన్ని తీసుకుని టీడీపీ నేత‌లు.. సీఎం జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాద‌ని.. ఆయ‌న‌కు వ్యూహాలు లేవ‌ని.. విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.

మిగిలిన విషయాల్లో…?

ఇక‌, తాజాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామ‌కాన్ని కూడా హైకోర్టు తోసిపుచ్చిన నేప‌థ్యంలో జ‌గ‌న్ నిర్ణయాలు వివాదం కావ‌డం అనే అంశాల‌ను మొత్తాన్ని రాజ‌కీయంగా వాడుకునేందుకు టీడీపీ నిర్ణయించుకుంది. త్వర‌లోనేదీనిపై ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో స్పందించిన వైసీపీ నాయ‌కులు.. ఈ ఒక్క విష‌యంలో జాగ్రత్తగా ఉంటే.. చాల‌ని ఇక‌, త‌మ‌కు తిరుగులేద‌ని.. ఓవ‌రాల్‌గా జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ప్రజ‌ల్లో తిరుగులేని ఆద‌ర‌ణ ఉంద‌ని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యాలే త‌మ పాల‌న‌కు తిరుగులేని సంకేతాలు అని వారు చెపుతున్నారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఇప్పట‌కీ అయినా దృష్టి పెడ‌తారా ? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News