అదే పెద్ద చర్చ కాబోతోందా ?
రాజ్యాంగంలో కోర్టులకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక విధంగా రాజ్యాంగ పరిరక్షణ కోర్టుల బాధ్యత. ఎందుకంటే కోర్టులకు ఏ కేసు వచ్చినా అది రాజ్యాంగబద్ధంగా ఉందా? లేదా? [more]
రాజ్యాంగంలో కోర్టులకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక విధంగా రాజ్యాంగ పరిరక్షణ కోర్టుల బాధ్యత. ఎందుకంటే కోర్టులకు ఏ కేసు వచ్చినా అది రాజ్యాంగబద్ధంగా ఉందా? లేదా? [more]
రాజ్యాంగంలో కోర్టులకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక విధంగా రాజ్యాంగ పరిరక్షణ కోర్టుల బాధ్యత. ఎందుకంటే కోర్టులకు ఏ కేసు వచ్చినా అది రాజ్యాంగబద్ధంగా ఉందా? లేదా? అని ప్రాధమికంగా చూస్తారు. అయితే ఏపీ సర్కార్ విషయంలో చూసుకుంటే కోర్టుల నుంచి తరచూ మొట్టికాయలు పడుతున్నాయి. అంటే ఇక్కడ ఒక విషయం చూడాల్సి ఉంది. ప్రభుత్వాలు కొన్ని సార్లు ఆదరాబదరాగా ఇచ్చే జీవోలలో కొన్ని సాంకేతిక అంశాలు మిస్ అవుతూంటారు. వాటినే కోర్టులు పట్టుకుంటాయి. అలా న్యాయ పరీక్షకు గురి అవుతాయి. మరి ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోలను కొట్టివేయడం వెనక ప్రభుత్వం తన పాలనా పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవడం కూడా అవసరమే.
స్పీకర్ మాట….
ఇవన్నీ ఇలా ఉంటే కోర్టుల వరస వ్యతిరేక తీర్పుల పట్ల వైసీపీలో అంతర్మధనం జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన స్పీకర్ సీనియర్ మోస్ట్ నాయకుడు తమ్మినేని సీతారాం రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల కోసమే ఉన్నాయని అంటున్నారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం తగదని అంటున్నారు. పరిమితులు పరిధులు నిర్ణయించుకుని ఒక వ్యవస్థకు మరో వ్యవస్థ గౌరవం ఇచ్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇదంతా ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల తీర్పులు రావడం పైన స్పందనగా చూడాలి.
చొరబడుతున్నారా…?
ఇక వైసీపీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు శాసన వ్యవస్థలోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని అంటున్నారు. దీని మీద చర్చ జరగాలని కూడా ఆయన కోరుతున్నారు. కోర్టుల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, అయితే కోర్టులు ప్రజాహితం చూడాలని ఆయన అంటున్నారు. తమ ఎన్నికల ప్రణాళికను అమలుచేయకుండా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, అవే కోరి మరీ పిటిషన్లు వేస్తున్నాయని అప్పలరాజు ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వారికి సేవ చేయాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయని కూడా అంటున్నారు.
అదే మాట …..
ఇక ఇదే సమయంలో దేశాన్ని ఏలుతున్న మోడీ సర్కార్ లో న్యాయశాఖ మంత్రిగా ఉన్న రవి శంకర్ ప్రసాద్ ప్రతిపక్షాలను నిందిస్తున్నారు. రాజకీయ ఉద్దేశ్యాలతో అవి కోర్టులకు వెళ్ళి అక్కడ నుంచి ప్రభుత్వాన్ని శాసించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇలా ఇటు వైసీపీనే కాదు, అటు మోడీ సర్కార్ కూడా ప్రజా వ్యాజ్యాలు వరసగా కోర్టులలో దాఖలు చేసి ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాల పట్ల ఆగ్రహంగా ఉన్నాయని అర్ధమవుతోంది. రెండూ అధికార ప్రభుత్వాలే. మోడీకి, జగన్ కి తరచుగా ఈ ఇబ్బంది వస్తోంది. మరి దీని మీద ఇలాగే మేధోమధనంతో పాటు నిపుణులతో చర్చలు ఉంటాయా అన్నది చూడాలి.