బాబు గొంతుకయితే….ఎలా?
సీపీఐ రామకృష్ణ ఇప్పుడు పక్కాగా తెలుగుదేశం పార్టీ మిత్రుడిగా మారిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం సీపీఐ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో కలసి చేసిన [more]
సీపీఐ రామకృష్ణ ఇప్పుడు పక్కాగా తెలుగుదేశం పార్టీ మిత్రుడిగా మారిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం సీపీఐ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో కలసి చేసిన [more]
సీపీఐ రామకృష్ణ ఇప్పుడు పక్కాగా తెలుగుదేశం పార్టీ మిత్రుడిగా మారిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం సీపీఐ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో కలసి చేసిన ప్రయోగం పూర్తిగా విఫలమయింది. ఒక్క సీటులో కూడా విజయం సాధించకపోవడంతో పాటు తాము కనీసం రెండో స్థానంలో ఉంటామన్న నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో సీపీఐ పరిస్థితి చెప్పకనే తెలుస్తోంది.
మూడు రాజధానుల ప్రకటన తర్వాత….
అయితే మూడు రాజధానుల ప్రకటన తర్వాత సీపీఐ ఒకరకంగా టీడీపీకి సపోర్టు చేస్తూ వస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సీపీఐ శాఖలు రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో పాటు అమరావతి రాజధాని కోసం చంద్రబాబుతో కలసి సీపీఐ రామకృష్ణ యాత్రలు చేయడం కూడా వివాదమయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, సీపీఐ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి.
కరోనాలోనూ రాజకీయం….
ఇక సీపీఐ రామకృష్ణ ఇటీవల చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నిని రాజీనామాకు డిమాండ్ చేస్తూ లేఖ రాయడం కూడా చర్చనీయాంశమైంది. ఒకవైపు రాష్ట్రంలో కరోనా కలకలం రేగుతుంటే రాజకీయాలకు రామకృష్ణ తెరతీశారన్న విమర్శలు విన్పించాయి. చంద్రబాబు తాను అనుకున్నది సీపీఐ రామకృష్ణ ద్వారా చెప్పిస్తున్నారన్న టాక్ బలంగా విన్పిస్తుంది. ఇక తాజాగా మరో లేఖ కూడా సీపీఐ రామకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.
సహకరించాల్సింది పోయి….
అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఆందోళలనలను పరిగణనలోకి తీసుకుని మూడు రాజధానుల అంశాన్ని ముగింపు పలకాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రైతుల దీక్షలు వందరోజులు పూర్తయిన సందర్భంగా జగన్ మొండిపట్టుదలకు పోకుండా రాజధాని వివాదాన్ని ముగించాలని సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి విపక్షాలు సహకరించాల్సింది పోయి చంద్రబాబు గొంతుకలా సీపీఐ మారిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వీటిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అన్ని పార్టీలు రాజకీయాలకతీతంగా కరోనా కట్టడిలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి ఉంది.