గూగూల్ పే తో ప్లే….?

సైబర్ నేరాలు రోజుకో రకంగా నడుస్తున్నాయి. ఆన్ లైన్ లో వున్న సొమ్ములు కాజేసేందుకు జిత్తులు మారి టక్కు టమారా విద్యలన్ని ఉపయోగించేస్తున్నారు మాయగాళ్లు. కంప్యూటర్ లను [more]

Update: 2019-07-24 01:53 GMT

సైబర్ నేరాలు రోజుకో రకంగా నడుస్తున్నాయి. ఆన్ లైన్ లో వున్న సొమ్ములు కాజేసేందుకు జిత్తులు మారి టక్కు టమారా విద్యలన్ని ఉపయోగించేస్తున్నారు మాయగాళ్లు. కంప్యూటర్ లను హ్యాక్ చేసి బ్యాంక్ లో సొమ్ములు మాయ చేసేవారు కొందరైతే మరికొందరు ఒటిపి నెంబర్లు తెలుసుకుని క్షణాల్లో ఖాతాలోని సొమ్ము కాజేస్తారు. ఇలా వీరు వాడే ట్రిక్ లు ఎప్పటికప్పుడు మారుస్తూ డబ్బు నొక్కేస్తుండటం తో పోలీసులు సైతం వీరి ఆగడాలకు చెక్ పెట్టలేకపోతున్నారు. తాజాగా కొత్త రకమైన మాయతో కుచ్చు టోపీ అమాయకులకు పెట్టేందుకు సైబర్ క్రైమ్ బ్యాచ్ దిగింది తస్మాత్తు జాగర్త గా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

గూగుల్ పే తో ఆట …

గూగుల్ పే నుంచి సొమ్ము మాయం చేయడం సాధారణంగా జరిగే పని కాదు. పటిష్టమైన సెక్యూరిటీ తో హ్యాకర్ల ఏ మాత్రం చిక్కకుండా దీన్ని గూగుల్ ఏర్పాటు చేసిన యాప్ అది. అయితే ఇందులో నుంచి స్వయంగా ఖాతాదారుడి చేతే డబ్బును తమ అకౌంట్ లో పడేలా నేరగాళ్లు పాత వస్తువులను విక్రయించే ఒ ఎల్ ఎక్స్ ను అడ్డుపెట్టుకోవడం గమనార్హం. ఒ ఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన వారి వివరాలు తెలుసుకుని వారికి ఫోన్ చేసి తాము వారు విక్రయించాలనుకుంటున్న వస్తువు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కాశ్మీర్ లో వున్నాం, కన్యాకుమారి లో ఉన్నందున అడ్వాన్స్ ను గూగుల్ పే ద్వారా చెల్లించి మిగిలిన సొమ్ము వస్తువు తీసుకునేటప్పుడు చెల్లిస్తామని చెబుతారు.

ఇలా చేసి అలా దోచేస్తారు …

అది నమ్మే అమ్మకందారుడు తమ గూగుల్ పే నుంబర్ ను వారికి చెప్పేస్తున్నారు. ఆ నెంబర్ కి వారు మని సెండింగ్ రిక్వెస్ట్ పంపి యుపిఐ ఐడి, క్యూ ఆర్ కోడ్ వివరాలు చెప్పమంటారు. రిక్వెస్ట్ మని పై పొరపాటున ఒకే చేసినా లేదా యుపిఐ ఐడి వంటి వివరాలు ఇచ్చిన వెంటనే మన ఖాతాలో సొమ్ము ఖాళీ చేసి పోతున్నారు. మోసపోయామని బాధితులు సంబంధిత గూగుల్, ఒ ఎల్ ఎక్స్ లను సంప్రదించినా ఇలాంటి వాటికి వారి బాధ్యత ఏమాత్రం ఉండదు. తమ పని అయిన వెంటనే ఖాతాలో సొమ్ము లాక్కున్న వారి ఫోన్ నెంబర్ లు మరి పని చేయవు.

ఈ నేరాలు పెరుగుతున్నాయి జాగ్రత్త….

ఇటీవల కాలంలో ఇలాంటి మోసపోయిన వారి సంఖ్య పెరుగుతూ ఉండటం పట్ల పోలీసులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు. డబ్బు పోగొట్టుకున్న తరువాత లబోదిబోమంటే ప్రయోజనం లేదంటున్నారు. అపరిచితులతో లావాదేవీల విషయంలో ముఖ్యంగా ఆన్ లైన్ లో చేసే వాటిపట్ల అవగాహన లేకుండా వ్యవహారాలు సాగించడం నష్టదాయకమని సూచిస్తున్నారు. ముఖ్యంగా యాప్ ల వాడకం పై పూర్తి అవగాహన పెంచుకున్న తరువాత మనీ యాప్ లు వినియోగించాలని కోరుతున్నారు సైబర్ నిపుణులు. చాలామంది వీటి వినియోగానికి సంబంధించి ఎలాంటి అవగాహన లేకుండా ఉండటం ప్రమాదకరమని పోలీసులు కూడా చెబుతున్నారు. సో బీ కేర్ ఫుల్

Tags:    

Similar News