మళ్లీ రైజ్ అవుతున్నారా?
ఎన్టీఆర్ అల్లుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఆయన భార్య పురందేశ్వరి కూడా రాజకీయాలలో [more]
ఎన్టీఆర్ అల్లుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఆయన భార్య పురందేశ్వరి కూడా రాజకీయాలలో [more]
ఎన్టీఆర్ అల్లుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఆయన భార్య పురందేశ్వరి కూడా రాజకీయాలలో కీలక వ్యక్తిగా వున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరగా, మొన్నటి ఎన్నికల వరకు తటస్థంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడితో కలిసి వైసీపీలోకి వెళ్లారు. పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
నిఘా పెట్టిందంటూ….
భార్యా, భర్తలిద్దరూ ఎవరికి వారు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఒకే ఇంట్లో రెండు జెండాలున్నా.. వీరు సఖ్యతగానే వున్నారు కానీ, పార్టీల అధినాయకులు మాత్రం ఈ ఇద్దరి పట్ల అపనమ్మకంతో ఉన్నారట. ఈక్రమంలోనే మారిన సమీకరణాల వల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని బీజేపీ టార్గెట్ చేస్తోంది. ఇటవల బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై మాటల యుద్ధం పెంచారు. పురందేశ్వరి సైతం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలోనే పురందరీశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై జగన్ సర్కారు నిఘా పెట్టిందన్న ఊహాగానాలు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి.
ఒడిపోయినప్పటికీ….
పర్చూరులో ఓడిపోయినప్పటికీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం తన హవా కొనసాగిస్తున్నారు. అటు పార్టీలో కూడా అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. ఇటీవల దగ్గుబాటి ఆయన కుమారుడు కలిసి మండలాల వారీగా, ఇటు అధికారులు అటు పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారట. ని యోజకవర్గంలో ప్రతీదీ తన కనుసన్నల్లోనే జరగాలని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పట్టుబడుతున్నారట. జిల్లాకే చెందిన మంత్రి బాలినేని సాయంతో పర్చూరుపై ఆయన పూర్తిగా గ్రిప్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోకడపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందన్న వార్త పార్టీలో తీవ్ర చర్చనీ యాంశమైంది.
ఏం చేస్తున్నారనేనా?
సీఎం జగన్ కూడా ఇటీవలదగ్గుబాటి వెంకటేశ్వరరావు కదలికపై ప్రత్యేక నిఘా పెట్టారని పార్టీలో గుసగుసలు వి నిపిస్తున్నాయి. నిఘా విభాగం అధికారులు ప్రత్యేకంగా పర్చూరు నియోజకవర్గ సమాచారాన్ని పసిగడుతూ సీఎంకు చేరవేస్తున్నట్లు సమాచారం. అయితే సొంత పార్టీ నాయకుడిపై అదే పార్టీ ప్రభుత్వం నిఘా ఎందుకు పెట్టిందన్న చర్చ హాట్‌హాట్ అవుతోంది. దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల కారణంమని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే, భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై వైసీపీ అధిష్టానం నిఘా పెట్టిందని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సొంత పార్టీ నాయకుడిపై జగన్ ప్రత్యేక నిఘా పెట్టడంపై ఆపార్టీలో చర్చకు తెరలేపింది.