అన్నగారి పెద్దల్లుడికి అమెరికా యాత్ర తప్పేట్లు లేదే?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఓడలు బళ్లవుతాయని, బళ్లు ఓడలవు తాయని అంటారు కదా.. అలా…విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఓడలు బళ్లవుతాయని, బళ్లు ఓడలవు తాయని అంటారు కదా.. అలా…విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఓడలు బళ్లవుతాయని, బళ్లు ఓడలవు తాయని అంటారు కదా.. అలా…విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో చక్రం తిప్పాలని భావించిన దివంగత ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో చతికిల పడ్డారు. వాస్తవానికి గత ఎన్నికల్లో తన కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ ను రంగంలోకి దింపి వైసీపీ తరఫున గెలిపించుకుందామని అనుకున్నారు. అయితే, అమెరికా పౌరసత్వం అడ్డుపడడంతో ఇది సాధ్యం కాలేదు. దీంతో చివరి నిముషంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. రాష్ట్రం అంతా వైసీపీ ప్రభంజనం క్రియేట్ అయినా పరుచూరులో మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు.
వైసీపీలోనే ఉన్నప్పటికీ…..
సరే… గెలుపు ఓటములు సహజమని అనుకన్నా.. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ కు దూరమయ్యారు. ఆయన సతీమణి, అన్నగారి కుమార్తె పురందేశ్వరి బీజేపీలో ఉండడం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉండడంతో రాజకీయంగా భిన్నధృవాలు ఒకే గాటన ఉన్నట్టయింది. పైగా ఆదిలో పురందేశ్వరి బీజేపీ నేతల మెప్పుకోసం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు హర్ట్ అయ్యారు. అంతే కాదు, వైసీపీలోనే ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు పన్నెత్తు మాట కూడా అనకపోయేసరికి జగనే స్వయంగా ఆయనను పక్కన పెట్టేశారు. దీంతో పరుచూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలోనే ఉన్నప్పటికీ ఆయనను పట్టించుకునే నాధుడు మాత్రం కరువయ్యారు.
గాదె చేరడంతో…..
దీంతో జగన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పక్కన పెట్టేసి ఎన్నికలకు ముందు వరకు పరుచూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రావి రామనాథం బాబుకు తిరిగి పగ్గాలు అప్పగించారు. అలాగే ఆయనకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక, తాజాగా ఇక్కడ నుంచి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గాదె వెంకటరెడ్డి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పర్చూరు నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 1991లో పర్చూరు నుంచి గెలుపొందాక రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టారు. 1994లో ఆయన మరోసారి పర్చూరు నంచి గెలుపొందారు. 2004 ఎన్నికల సమయంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కాంగ్రెస్‌లో చేరడంతో అప్పడు వైఎస్ రాజశేఖరెడ్డి గాదెను గుంటూరు జిల్లాలోని బాపట్ల నుంచి పోటీ చేయించారు. అక్కడ ఆయన 2004, 09 ఎన్నికల్లో గెలిచారు. వైఎస్ చనిపోయాక కూడా కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలం చెందారు.
పర్చూరు టిక్కెట్ కోసం….
రాజకీయంగా కుమారుడు మధుసూదనరెడ్డిని కొన్నేళ్ల నుంచి గాదె వెంకటరెడ్డి ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన్ను రంగంలోకి దించేందుకు ప్రయత్నించగా అవకాశం రాలేదు. అటు బాపట్ల, ఇటు పర్చూరు నియోజకవర్గాలపై తనకున్న పట్టును దృష్టిలో ఉంచుకుని ఏదో ఒక స్థానం నుంచి కుమారుడ్ని పోటీలో ఉంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. బాపట్లలో వైసీపీ ఎమ్మెల్యే ఉండగా, పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. స్వతాహాగా నియోజకవర్గంలో గాదెకు మంచి పరిచయాలు కూడా ఉన్నా యి. వచ్చే ఎన్నికల్లో కుమారుడి రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇక, ఈ పరిణామం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి తలుపులు మూసేసినట్టయింది. అయితే, ఆయన తరచుగా తన అనుచరులతో అన్నట్టుగా ఏ మాత్రం వీలు దొరికినా అమెరికా వెళ్లిపోతాను (కొడుకు దగ్గరకు)! అనే మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయని అంటున్నారు.