ఏబీ తర్వాత ఆయనేనటగా?
ఎవరు చేసుకున్నది వారు అనుభవించాల్సిందే. అనేది తెలుగు సామెత. ఇప్పుడు దీనినే స్మరించుకుంటున్నారు ఏపీలో ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌లు. ప్రభుత్వం ఏదైనా సరే హద్దులు చెరిపేసుకుని విచ్చలవిడితనంతో వ్యవహరిస్తే.. [more]
ఎవరు చేసుకున్నది వారు అనుభవించాల్సిందే. అనేది తెలుగు సామెత. ఇప్పుడు దీనినే స్మరించుకుంటున్నారు ఏపీలో ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌లు. ప్రభుత్వం ఏదైనా సరే హద్దులు చెరిపేసుకుని విచ్చలవిడితనంతో వ్యవహరిస్తే.. [more]
ఎవరు చేసుకున్నది వారు అనుభవించాల్సిందే. అనేది తెలుగు సామెత. ఇప్పుడు దీనినే స్మరించుకుంటున్నారు ఏపీలో ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌లు. ప్రభుత్వం ఏదైనా సరే హద్దులు చెరిపేసుకుని విచ్చలవిడితనంతో వ్యవహరిస్తే.. ఏం జరుగుతుందో ? ఇప్పుడు ఏపీలోని ఒకరిద్దరు అధికారులను చూస్తే స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు. నిన్న మొన్నటి వరకు ఐఆర్ఎస్ అధికారి, జాస్తి కృష్ణప్రసాద్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆయన దాదాపు వందల కోట్లలో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ జగన్ ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టింది. జీతం కూడా నిలిపివేసింది.
ఎనిమిది నెలలుగా….
దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించడం, క్యాట్ ఆదేశాలు ఇవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే, అసలు ఇంత వరకు ఎందుకు తెచ్చుకోవాలి ? అనేది కీలక ప్రశ్న. కేవలం రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గి ఉంటే ఇలా జరిగేది కాదనేది నిపుణుల మాట. వ్యక్తిగత అంశాలపై ఉన్న శ్రద్ధ కారణంగా వ్యవస్థలు ఇలా మారుతున్నాయని వారు అంటున్నారు. ఇక, ఇప్పుడు ఇంటిలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరావు ఉదంతం తెరమీదికి వచ్చింది. ఆయనను 8 నెలలుగా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. దీనిపై ఆయన ఎక్కడా బాధపడలేదు. క్యాట్ తదితర సంస్థలను కూడా ఆశ్రయించలేదు. ఇక, ఇప్పుడు తన హయాంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెన్షన్ చేసింది.
అనుకూలంగా ఉన్న వారే…..
ఈ పరిణామం నిజానికి ఐపీఎస్ అధికారుల్లో ఆశ్చర్యం కలిగిస్తుందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పుట్టిస్తుందని అనుకున్నవారికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే గతంలో ఏబీ వ్యవహరించిన తీరును తెలిసిన వారు ఎంత చేసుకున్న వారికి అంత అని నిట్టూరుస్తున్నారు. ఏబీని ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని టీడీపీలోనే కొందరు హర్షిస్తోన్న పరిస్థితి. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక్కరే కాదు… చాలా మంది టీడీపీ సీనియర్లది కూడా అదే మాటగా కనిపిస్తోంది.
స్వయంకృతమే…..
ఇక, ఈ పరంపర ఇక్కడితో ఆగిపోయిందా? అంటే కష్టమేననే సంకేతాలు వస్తున్నాయి. మాజీ డీజీపీ ఠాగూర్ కూడా ఈ జాబితాలో ఉన్నారనేది మరో సమాచారం. ఆయన కూడా గతంలో ఓ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ఆయనను ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘమే సైలెంట్ మోడ్‌లో పెట్టింది. ఈ క్రమంలో ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టింది. ఇక, ఇప్పుడు ఏబీ తర్వాత ఠాగూర్ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అఖిల భారత సర్వీసు అధికారులు అవమానాలకు గురికావడం వెనుక స్వయంకృతమే ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు.