తగ్గుతున్నారట… అదే టెన్షన్
ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. ఇది ఏదో ఒక దేశం, ప్రాంతానికి పరిమితమైన అంశం కాదు. 2019 డిసెంబరు నాటికి ప్రపంచ జనాభా సుమారు 775 కోట్లు [more]
ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. ఇది ఏదో ఒక దేశం, ప్రాంతానికి పరిమితమైన అంశం కాదు. 2019 డిసెంబరు నాటికి ప్రపంచ జనాభా సుమారు 775 కోట్లు [more]
ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. ఇది ఏదో ఒక దేశం, ప్రాంతానికి పరిమితమైన అంశం కాదు. 2019 డిసెంబరు నాటికి ప్రపంచ జనాభా సుమారు 775 కోట్లు అని అంచనా. ఈ విషయంలో చైనా తొలి స్థానంలో ఉండగా దాదాపు 136 కోట్ల జనాభాతో భారత్ రెండో స్థానంలో ఉంది. కొన్నేళ్లలో భారత్ జనాభా చైనాను మించిపోగలదన్న అభిప్రాయం ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులు సమకూర్చడం పాలకులకు పెను సవాల్ గా మారింది. మౌలికరంగంపైన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ అవి చాలడం లేదు.
అమెరికాలో తగ్గుతున్న…..
పెరుగుతున్న జనాభాను నియంత్రించడం ఎలాగో అర్థంకాక పాలకులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ లో ఈ పరిస్థితి నెలకొంది. పైన చెప్పుకున్నదంతా నాణేనికి ఒక కోణం మాత్రమే. అయితే నాణేనికి గల రెండో కోణం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అగ్రరాజ్యమైన అమెరికా జనాభా తగ్గుతోంది. మరో కోణంలో చెప్పాలంటే తగ్గడమో లేదా నిలకడగా ఉండటమో జరుగుతుంది. పెరుగుదల మాత్రం లోపించిందన్నది మాత్రం వాస్తవం. ప్రస్తుతం ఈ సమస్యపైనే అమెరికా తలపట్టుకుని కూర్చొంటోంది. జనాభా పెరగడం ఏరకంగా ఇబ్బందో తరగడమూ లేదా నిలకడగా ఉండటమూ ఇబ్బందే అని చెప్పక తప్పదు. ఈ పరిస్థితికి గల కారణాలపై అధ్యయనం జరుగుతోంది.
మరణాలు పెరగడం…
గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా అగ్రరాజ్యంలో జనాభావృద్ధిలో తగ్గుదల మొదలయింది. ఇందుకు కారణాలు ప్రధానమైనవి మూడు. జననాలు తగ్గడం, మరణాలు పెరగడం, వలసలు తగ్గడం ఇందుకు కారణాలని విశ్లేషకుల అభిప్రాయం. మరి కొన్నేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న ఆందోళన అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 1917 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అత్యల్ప జనాభావృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు. 2018-2019లో కేవలం అయిదుశాతం జనాభావృద్ధి నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుత అమెరికా జనాభా సుమారు 33 కోట్ల లోపే కావడం విశేషం. జననాల సంఖ్య తగ్గడంతో ఆ మేరకు వృద్ధుల జనాభా పెరుగుతోంది. ఫలితంగా వృద్ధులకు సేవలు అందించేవారు కరవవుతున్నారు. జననాలు రేటు తగ్గడంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నమోదుపై ప్రభావం పడుతోంది. పశ్చిమ వర్జీనియా, న్యూహ్యాంప్ షైర్, వెర్మెంటో రాష్ట్రాల్లో జనాభావృద్ధి మందగించిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్యూర్టోరికోలో మాత్రం గత దశాబ్దకాలంలో జనాభా పెరుగుదల నమోదు అయింది. గత కొన్నేళ్లుగా తరచూ హరికేన్లతో ఈ ప్రాంతం సతమతమవుతోంది. ఫలితంగా ఆర్థికంగా దెబ్బతినింది. ఇతర ప్రాంతాల నుంచి వలసలు రావడంతో ఈ ద్వీపంలో కేవలం 340 మంది జనాభా మాత్రమే పెరగడం గమనార్హం.
వలసలు పెరగడం కూడా…
వివిధ దేశాల నుంచి మేధోపరమైన, ఇతర వలసలు పెరగడం కూడా అగ్రరాజ్యం జనాభా తగ్గడానికి ఒక కారణం. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసలపై కఠిన ఆంక్షలు విధించారు. ఫలితంగా విద్య, ఉద్యోగ, ఇతర ఉపాధి అవకాశాల కోసం అమెరికాలో అడుగు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే దేశంలో ఉన్న వారిపై కూడా వివిధ రకాల ఆంక్షలు విధిస్తుండటంతో వారంతా తట్టాబుట్టా సర్దుకుని మాతృదేశాలకు వెళుతున్నారు. మరికొంతమంది హెచ్1 బీ వీసా మంజూరు తిరస్కరిస్తుండటంతో వారూ సొంత దేశాలకు వెళ్లిపోతున్నారు. 2016లో పది లక్షలకు మంది పైగా అమెరికాకు వలస రాగా, గత ఏడాది ఆ సంఖ్య దాదాపు ఆరు లక్షలకు పడిపోవడం గమనార్హం. వలసలపై ఆంక్షలను సరళతరం చేస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అమెరికాలోని ప్రధాన నగరాలైన న్యూయార్క్ లో గరిష్టంగా జనాభా 77 వేలు తగ్గడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ కార్యాలయాలు కొలువై ఉన్న ఈ నగరం కీలకమైంది. హవాయ్, న్యూజెర్సీ, మిస్సిస్సిపి, వెర్నమౌంట్, రాష్ట్రాల్లో అయిదు వేల చొప్పున జనాభా తగ్గుదల నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.
కొన్ని రాష్ట్రాల్లో…..
2018-19లో జనాభావృద్ధి అమెరికాలో కేవలం 0.48 శాతం మాత్రమేనని ఇటీవల వెల్లడైన జనాభా, గణాంకాలు పేర్కొంటున్నాయి. 2010-2020 మధ్య కాలంలో జనాభావృద్ధి కేవలం 7.1 శాతంగా ఉంది. 2010 తర్వాత అతి తక్కువ జననాలు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరిగింది. కాలిఫోర్నియా లో జనాభా సంఖ్య తగ్గగా టెక్సాస్ లో పెరగడం విశేషం. టెక్సాస్ రాష్ట్రం మెక్సికో సరిహద్దుల్లో ఉంటుంది. మెక్సికో నుంచి నిత్యం ప్రజలు ఉపాధి కోసం వలస వస్తుంటారు. ఈ వలస సమస్యను అధిగమించడానికి డొనాల్డ్ ట్రంప్ మెక్సికో – అమెరికా మధ్య సరిహద్దు గోడ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొలంబియా, నెవెడా, కొలారడో, అరిజోనా తదితర రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. కొన్ని చోట్ల హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ అమెరికా దేశవ్యాప్తంగా జనాభా పరిస్థిితి ఆందోళనకు గురి చేస్తుంది.
-ఎడిటోరియల్ డెస్క్