ఢిల్లీని పట్టుకుంది… వదిలేట్లు లేదే?

దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ తో అట్టుడికిపోతుంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ మినహాయింపులతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతున్నాయి. నాల్గో [more]

Update: 2020-05-28 18:29 GMT

దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ తో అట్టుడికిపోతుంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ మినహాయింపులతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతున్నాయి. నాల్గో విడత లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ అన్ని రకాల మినహాయింపులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. దీంతో కేసుల సంఖ్య ఎక్కవయిపోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండు వేలు దాటింది.

ఇక్కడి నుంచే వ్యాపించి…

కరోనా వైరస్ వ్యాప్తి ఢిల్లీ నుంచే ప్రారంభమయింది. కేరళలో తొలి కేసు నమోదయినప్పటికీ ఢిల్లీలో మర్కజ్ మసీద్ ప్రార్థనల తర్వాత ఇక్కడి నుంచే వైరస్ ప్రారంభమయింది. నిజాముద్దీన్ ప్రార్థనల తర్వాత వేలాది మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. కరోనా వ్యాప్తి చెందిన సమయానికే మర్కజ్ మసీదులో వందలాది మంది ఉన్నారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలించారు. దీంతో ఢిల్లీలో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది.

సడలింపులతో….

అయితే మూడో విడత లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చారు. మద్యం షాపులకు కూడా మినహాయింపులు ఇచ్చారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాతనే ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. 500 కేసులకు తగ్గకుండా రోజు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ ఢిల్లీలో కరోనా కారణంగా 180 మంది వరకూ మరణించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అరవింద్ కేజ్రీవాల్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెరిగే అవకాశాలే ఎక్కువ…

ఇదిలా ఉండగా ఢిల్లీపై మరో పెద్ద పిడుగు లాంటి వార్త వచ్చింది. ఢిల్లీలో రోజుకు వెయ్యి కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆ రాష్ట్ర కరోనా నియంత్రణ కమిటీ ఛైర్మన్ ఎస్.కె. నరీన్ పేర్కొనడం ఆందోళన కల్గించే అంశమే. కంటెన్మయిమెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గించారు. గతతంలో 97వరకూ ఉన్న జోన్ల సంఖ్య 66కు కుదించారు. దీనివల్ల కూడా కేసులు పెరిగాయంటున్నారు. మొత్తం మీద ఢిల్లీని కరోనా వైరస్ రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముంది.

.

Tags:    

Similar News