ఢిల్లీలో మొదలయి… అక్కడే అంటుకుని?

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల విషయంలో రెండో ప్లేస్ లో ఉంది. ఇప్పటివరకూ 503 మందికి కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏడుగురు [more]

Update: 2020-04-05 16:30 GMT

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల విషయంలో రెండో ప్లేస్ లో ఉంది. ఇప్పటివరకూ 503 మందికి కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏడుగురు వరకూ కరోనాతో ఢిల్లీలో మరణించారు. ఢిల్లీలో తొలి నుంచి కరోనా వైరస్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మురికివాడలు ఎక్కువగా ఉండటం, వలస కూలీలు అత్యధికంగా ఉండటంతో కరోనా ఎక్కువగా విజృంభించే అవకాశముందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది.

మర్కజ్ మసీదు ప్రార్థనలతో……

అయితే తాజాగా మజ్కర్ మసీదు ప్రార్థనల అనంతరం ఢిల్లీలో మరింత ఆందోళన పెరిగింది. దాదాపు ఎనిమిది వేల మంది నిజాముద్దీన్ మర్కజ్ మసీదుకు హాజరయినట్లు గుర్తించారు. వీరు ప్రార్థనల తర్వాత దాదాపు ఆరు వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన అధికారులు మసీదులో ఉన్న దాదాపు రెండు వేల మందిని క్వారంటైన్ కు తరలించారు. వీరిలో కూడా ఎక్కువ మందికి పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది.

మరణాల సంఖ్య కూడా….

ఢిల్లీలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎయిమ్స్ వైద్యులకు కూడా కరోనా వైరస్ సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ రాజధాని కావడం, వీఐపీలు కూడా ఎక్కువగా ఉండటంతో ఢిల్లీ అంతటా ఎప్పటికప్పుడు కార్పొరేషన్ శానిటైజేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ప్రజలు పాటించకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ అయింది. వారికి భారీగా జరిమానాలు కూడా విధించింది.

కట్టుదిట్టమైన చర్యలు….

మర్కజ్ మతప్రార్థనల తర్వాత ఢిల్లీ నుంచి వెళ్లిన వారు దాదాపు పదిహేడు రాష్ట్రాలకు ఈ వైరస్ ను అంటించారు. వేల సంఖ్యలో ఉన్న వీరిని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి క్వారంటైన్ కు తరలించాయి. ఢిల్లీలో మతప్రార్థనలు జరిగిన నిజాముద్దీన్ ప్రాంతాన్ని హైఅలెర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని దాదాపుగా ఖాళీ చేయించారు. అరవింద్ కేజ్రీవాల్ సయితం పేద కుటుంబాలకు ఐదువేల రూపాయలను ప్రకటించారు. కరోనా వైరస్ కు వైద్యం చేస్తూ మృతి చెందితే కోటి రూపాయలు ఆ కుటుంబానికి సాయాన్ని కూడా ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో భేటీ అవుతూ కరోనాను కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News