తెలంగాణ కు రెండు రాజధానులు …?
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు. ఈ అంశం ఏపీ లో ప్రధాన విపక్షానికి నిద్ర లేకుండా చేసింది. న్యాయ ప్రక్రియల్లో ఆలస్యంతో ఈ త్రీ క్యాపిటల్స్ అంశం [more]
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు. ఈ అంశం ఏపీ లో ప్రధాన విపక్షానికి నిద్ర లేకుండా చేసింది. న్యాయ ప్రక్రియల్లో ఆలస్యంతో ఈ త్రీ క్యాపిటల్స్ అంశం [more]
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు. ఈ అంశం ఏపీ లో ప్రధాన విపక్షానికి నిద్ర లేకుండా చేసింది. న్యాయ ప్రక్రియల్లో ఆలస్యంతో ఈ త్రీ క్యాపిటల్స్ అంశం ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులుగా ఏపీ ని తీర్చి దిద్దడం ఖాయమనే చెబుతూ వస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ లో రెండు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారుతుంది.
వరంగల్ ను రాజధానిగా …
హైదరాబాద్ విశ్వనగరం గా మారిపోయింది. సో అక్కడ కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు భవిష్యత్తులో పరిష్కరించలేనంతగా పెరగనున్నాయి. కనుక కాకతీయుల రాజధాని వరంగల్ ను తెలంగాణ రాజధానిగా ప్రకటించాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన తీన్మార్ మల్లన్న కొత్త స్లోగన్ అందుకున్నారు. ఇందుకోసం ఉద్యమం మొదలు పెట్టేదామని రాజధాని చిచ్చు రగిలించారు మల్లన్న. అది ఆ ప్రాంతవాసుల్లో కొత్త ఊపు తెచ్చిందనే చెప్పాలి.
కేసీఆర్ ఫార్ములా తోనే …
దశాబ్దాలుగా ఉన్న తెలంగాణ సెంటిమెంట్ ని అస్త్రంగా చేసుకుని ఆ ఉద్యమంలో విజయం అందుకుని రాష్ట్రం సాధించడంతో పాటు రెండు దఫాలు సిఎం అయ్యారు కేసీఆర్. కులం, మతం, ప్రాంతం అనే భావోద్వేగ అంశాలకు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా రాజకీయాలు నడిపించి విజేతలు కావొచ్చన్నదానికి కేసీఆర్ ఉదాహరణగా కనబడతారు. గులాబీ పార్టీతో బలంగా తెలంగాణ లో మారిన కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే ఇప్పుడు ఆయన ప్రత్యర్ధులు ఆయన ఫార్ములాతోనే టీఆరెస్ కు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. మరి గులాబీ బాస్ ఈ కొత్త నినాదానికి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.