రాజీనామాలు ఎవరు చేయాలి?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజీనామాల డిమాండ్ ఊపందుకున్నాయి. అమరావతి తెచ్చిన తంటాతో ఇప్పుడు ఎవరు ముందుగా రాజీనామా చేయాలన్న చర్చ జోరుగా సాగుతుంది. అధికార వైసీపీ, విపక్ష [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజీనామాల డిమాండ్ ఊపందుకున్నాయి. అమరావతి తెచ్చిన తంటాతో ఇప్పుడు ఎవరు ముందుగా రాజీనామా చేయాలన్న చర్చ జోరుగా సాగుతుంది. అధికార వైసీపీ, విపక్ష [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజీనామాల డిమాండ్ ఊపందుకున్నాయి. అమరావతి తెచ్చిన తంటాతో ఇప్పుడు ఎవరు ముందుగా రాజీనామా చేయాలన్న చర్చ జోరుగా సాగుతుంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు ముందు మీరు రాజీనామా చేయాలంటే మీరు రాజీనామా చేయాలని సవాళ్లు విసురుకుంటున్నాయి. అయితే ఇది కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే అన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది.
సవాళ్ల మీద సవాళ్లు…..
రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులకు తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ లు తొలి నుంచి అండగా ఉన్నారు. రాజధాని ఎక్కడికీ తరలిపోదని వారిని ఊదరగొట్టారు. రైతులు కూడా 230 రోజులుగా అమరావతి ప్రాంతంలో దీక్షలు కూడా చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం పొందింది. సీఆర్డీఏ రద్దు చేస్తూ కొత్తగా అమరావతి అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమయింది.
బీటెక్ రవి రాజీనామా….
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలోని వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిపై రిఫరెండం కోరాలని, తిరిగి మ్యాన్ డేట్ కోరాలని జగన్ కు సవాల్ విసిరారు. మరోవైపు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాభిప్రాయాన్ని కోరాలని ఆయన సవాల్ విసిరారు.
రెడీ అంటున్న వంశీ…..
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేన వంశీ రాజీనామాకు రెడీ అయ్యారు. తాను ఉప ఎన్నికకు సిద్ధమేనని ప్రకటించారు. గన్నవరం ఉప ఎన్నికకు, మూడు రాజధానులకు ముడిపెట్టనా అభ్యంతరం లేదని వంశీ సవాల్ విసిరారు. మరోవైపు మంత్రి నారాయణస్వామి మరో సవాల్ విసిరారు. మూడు ప్రాంతాలకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాభిప్రాయాన్ని కోరాలన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు చేస్తుంది తాము కాబట్టి తాము రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నది వైసీపీ వాదన. టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి తిరిగి గెలిస్తే తాము రాజధాని తరలింపుపై పునరాలోచనకు సిద్ధమని వైసీపీ అంటుంది.ఇంతకీ ఎవరు రాజీనామాలు ముందు చేయాలి. సవాళ్లతో సరిపెడతారా? నిజంగానే రాజీనామాలు చేస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.