బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్
మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవర్ ప్రమాణస్వీకారం చేశారు. నిన్న [more]
మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవర్ ప్రమాణస్వీకారం చేశారు. నిన్న [more]
మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవర్ ప్రమాణస్వీకారం చేశారు. నిన్న రాత్రి వరకూ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని భావించాయి. ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించాయి. అయితే రాత్రికి రాత్రే మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది.
ఎన్సీపీలో చీలికతో…..
ఎస్సీపీ బీజేపీకి మద్దతివ్వడంతో ప్రభుత్వం ఏర్పాటయింది. అజిత్ పవార్ తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీతో మద్దతు పలకడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫలితాల తర్వాత శివసేన ఇతర పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడిందని, మహారాష్ట్రలో కిచిడి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోలేదని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. దేవేంద్ర ఫడ్నవిస్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్సీపీలో చీలిక బీజేపీకి కలసి వచ్చింది.