మళ్లీ ఛాన్స్ ఉందటగా

బీజేపీ, శివసేనల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా? ఇందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రయత్నాలు చేస్తుందా? అంటే అవుననే అనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ [more]

Update: 2020-02-25 17:30 GMT

బీజేపీ, శివసేనల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా? ఇందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రయత్నాలు చేస్తుందా? అంటే అవుననే అనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ కొంతకాలమే ఉంటారని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయనే చెప్పాలి. ప్రతిపక్షనేతగా ఆయన కొంతకాలమే ఉంటారన్న సురేష్ భయ్యా వ్యాఖ్యల్లో అర్థాలను వెతుక్కుంటున్నారు కొందరు.

మిత్రులుగా ఉండి…..

నిజానికి భారతీయ జనతా పార్టీ, శివసేనలు రెండూ దశాబ్దాలుగా మిత్రులుగా కొనసాగుతూ వస్తున్నాయి. రెండు పార్టీలూ హిందూ ఓటు బ్యాంకుపైనే ఆధారపడతాయి. శివసేన హిందూ ఓటు బ్యాంకుతో పాటు లోకల్ నినాదాన్ని కూడా భుజానకెత్తుకుంటోంది. అయితే మోదీ, షాల చేతికి బీజేపీ పగ్గాలు అందిన తర్వాత మిత్రులను కట్టడి చేసే పనిని ప్రారంభించింది. మహారాష్ట్రలో శివసేనను కూడా కట్టడి చేయాలని చూసింది.

ఆర్ఎస్ఎస్ సయోధ్యకు….

మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నప్పటికీ రెండు పార్టీల మధ్య చెడింది. శివసేన రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి కోరుకోవడాన్ని బీజేపీ అభ్యంతరం చెప్పింది. అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధపడలేదు. దీంతో శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇద్దరి మధ్య అప్పట్లో సయోధ్య కుదర్చడానికి ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ప్రయత్నాలు మొదలయ్యాయా?

తాజాగా ఉద్ధవ్ థాక్రే మోదీని కలవడం, ఆ తర్వాత మర్యాదపూర్వకంగా అద్వానీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యా కూడా ఫడ్నవిస్ కొంతకాలమే ప్రతిపక్ష నేతగా ఉంటారని చెప్పడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. తిరిగి ఆర్ఎస్ఎస్ శివసేన, బీజేపీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. మొత్తం మీద ఫడ్నవిస్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందన్న ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలు సంచలనమే కల్గిస్తున్నాయి.

Tags:    

Similar News