గెలిపిస్తారా? నిలిచి చూపిస్తారా?
బీహార్ ఎన్నికలు బీజేపీకే కాదు ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎన్నికల ఇన్ చార్జిగా నియమించింది. [more]
బీహార్ ఎన్నికలు బీజేపీకే కాదు ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎన్నికల ఇన్ చార్జిగా నియమించింది. [more]
బీహార్ ఎన్నికలు బీజేపీకే కాదు ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఎన్నికల ఇన్ చార్జిగా నియమించింది. అందరితో సత్సంబంధాలు ఉండటం, కూటమి పార్టీలను కలుపుకుని పోతారన్న ఉద్దేశ్యంతో దేవేంద్ర ఫడ్నవిస్ పై నమ్మకంతో పార్టీ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. దేవేంద్ర ఫడ్నవిస్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు.
అధిష్టానం పూర్తి బాధ్యతలు….
బీహార్ లో ఎన్డీఏ కూటమి ఈసారి విజయం సాధించాల్స ఉంది. 2015లో జరిగిన ఎన్నికల్లో నిజానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాలేదు. తదనంతరం జరిగిన పరిణామాలతో నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరడంతో బీహార్ అధికారం దక్కింది. సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి అన్నీ దగ్గరుండి చూసుకోవాలని దేవేంద్ర ఫడ్నవిస్ కు అధిష్టానం బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకే సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూసుకోగలిగారు.
నితీష్ కు అండగా…..
మరోవైపు కూటమి నుంచి వెళ్లిపోయిన లోక్ జనశక్తి పార్టీపై విమర్శలు చేస్తూ నితీష్ కుమార్ కు దేవేంద్ర ఫడ్నవిస్ అండగా నిలుస్తున్నారు. మోదీ ఫొటోలను ప్రచారంలో వాడుకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోక తప్పదని ఆయన చిరాగ్ పాశ్వాన్ ను హెచ్చరించారు కూడా. మోదీ ప్రచార సభల సమన్వయ బాధ్యతలను కూడా దేవేంద్ర ఫడ్నవిస్ భుజాన వేసుకున్నారు. ఎప్పటికప్పడు కేంద్ర నాయకత్వానికి నివేదికలు పంపుతున్నారు.
భవిష్యత్ ఉందంటూ…..
బీజేపీలో భవిష్యత్ ఉన్న నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవిస్ కు పేరుంది. ఆయనకు ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉండటం కూడా కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో సక్సెస్ అయితే బీజేపీ లో భవిష్యత్ బాగా ఉంటుందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. సర్వేలు సయితం ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండటంతో దేవేంద్ర ఫడ్నవిస్ కు రానున్నది మంచికాలమేనంటున్నారు బీజేపీ నేతలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.