బ్రేకింగ్ : మహారాష్ట్ర అసెంబ్లీ రద్దు…??

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైన బేజీపీ ఇందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ వరకు  పదవీకాలం ఉన్న మహారాష్ట్ర [more]

Update: 2019-03-07 13:58 GMT

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైన బేజీపీ ఇందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ వరకు పదవీకాలం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయీన్న యోచనలో ఉంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఒకేసారి ఎన్నికలకు వెళ్లే యోచనలో కమలనాథులు ఉన్నారు. అసెంబ్లీ, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగాలని కొంత కాలంగా ఉన్న డిమాండ్ ను చర్చించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 03:30గంటలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ తో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. మహారాష్ట్రలోని మొత్తం 48 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే ఒప్పందం కుదిరింది. పార్లమెంటు ఎన్నికల్లోనే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలసి పోటీ చేయాలని నిర్ణయించిన బీజేపీ, శివసేన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తిరిగి వస్తే బీజేపీ రెండున్నరేళ్లు, శివసేన రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News