ఇది సమయం కాదు మిత్రమా అన్నా వినడం లేదే?
విజయవాడ అంటేనే ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హీటెక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా కరోనా నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే, కరోనా కేసుల వల్లో.. [more]
విజయవాడ అంటేనే ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హీటెక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా కరోనా నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే, కరోనా కేసుల వల్లో.. [more]
విజయవాడ అంటేనే ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హీటెక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా కరోనా నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే, కరోనా కేసుల వల్లో.. కరోనా కారణంగా జరుగుతున్న లాక్‌డౌన్ వల్లో రాజకీయాలు హీటెక్కలేదు. ఇద్దరు వైసీపీ నేతల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు కారణంగానే ఇప్పుడు విజయవాడలో రాజకీయాలు హీటెక్కాయని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో.. ఇంచార్జ్‌గా దేవినేని అవినాష్ ఉన్నారు. ఇక, విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్‌గా బొప్పన భవకుమార్ ఉన్నారు.
పంపిణీ చేసే విషయంలో….
గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన భవకుమార్ ఓడిపోగా.. ఆ తర్వాత గుడివాడలో టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ వైసీపీలోకి రావడంతో జగన్ అవినాష్‌కు తూర్పు పగ్గాలు ఇచ్చి… భవకుమార్‌కు నగర పార్టీ పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. తాజాగా కరోనా కిట్ల కోసం నిధులు సేకరించి, ఓ లక్ష మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను కొనుగోలు చేశారు. అయితే, దీనికి నిధులు ఎవరు ఇచ్చారు? ఎవరి పిలుపు మేరకు ఇచ్చారనే విషయాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. కానీ, పంచే విషయం వచ్చేసరికి ఇక్కడే ఆధిపత్య రాజకీయం తెరమీదికి వచ్చింది.
పింఛన్ల పంపిణీలోనూ…..
తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ కాబట్టి తానే ప్రారంభిస్తానని అవినాష్, కాదు, మొత్తం నగరానికే పార్టీ చీఫ్‌గా ఉన్న తానే ప్రారంభిస్తానని బొప్పన ఒకరికి ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత? అనే రేంజ్‌లో వ్యాఖ్యలు చేసుకున్నట్టు సమాచారం. చివరకు ఎవరూ పంచకుండానే ఇవి మూలుగుతున్నాయని అంటున్నారు. ఇదిలావుంటే, ఇటీవల ఒకటోతారీకున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనూ ఇదే తరహా రగడ చోటు చేసు కుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వలంటీర్ల వెంట వెళ్లిన వైసీపీ నాయకులు (స్థానికఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు)పింఛన్లను తమ చేతుల మీదుగా పంచారు. ఇక, తూర్పులోనూ ఇదేతరహా ప్రయత్నం జరిగింది. అయితే, స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా ఉన్నవారు వలంటీర్ల వెంట వెళ్లి పింఛన్లు పంచే ప్రయత్నం చేయగా ఇరు వర్గాలు మరోసారి తలపడ్డాయి.ఎవరికి వారు తమ చేతుల మీదగానే ఫించన్లు పంచాలని పట్టుబట్టారు. ఏదేమనా మొత్తానికి తూర్పు వైసీపీ రాజకీయం మంచి రంజుగా మారిందనే చెప్పాలి. మరి ఈ ఇద్దరు నేతల వివాదం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి .