సత్తా చూపించేదెవరు?
గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడ రాజకీయాలు మళ్లీ అనూహ్యంగా వేడెక్కాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టున్న తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు సంచలనంగా [more]
గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడ రాజకీయాలు మళ్లీ అనూహ్యంగా వేడెక్కాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టున్న తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు సంచలనంగా [more]
గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడ రాజకీయాలు మళ్లీ అనూహ్యంగా వేడెక్కాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టున్న తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు సంచలనంగా మారాయి. దీనికి ప్రధాన కారణం.. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి కండువా మార్చుకున్న యువ కిశోరం దేవినేని అవినాష్. ఆయన పార్టీలోకి వచ్చి నాలుగు రోజులు కూడా కాకముందే.. అవినాష్ సుదీర్ఘ కలగా ఉన్న తూర్పు నియోజకవర్గం బాధ్యతలను వైసీపీ అప్పగించేసింది. “ఇక, ఈ నియో జవకర్గం బాధ్యతలు నీవే. ఎలా పార్టీ ని డెవలప్ చేస్తావో నీ ఇష్టం. వెనకాల మేం ఉంటాం..,. నువ్వు దూసుకుపో!“ అంటూ .. పార్టీ అధినేత జగన్ నుంచి పూర్తిగా భరోసా వచ్చింది.
అనుకూలంగా మార్చుకుంటాడా?
దీంతో ఒక్కసారిగా తూర్పులో రాజకీయం వేడెక్కిందని అంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు ఈ నియోజ కవర్గం కంకిపాడుగా ఉండేది. ఇక్కడ అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ హవా జోరుగా సాగింది. పలు మార్లు ఆయన కంకిపాడు నియజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అలాంటి కీలకమైన నియోజకవర్గం కోసమే దేవినేని అవినాష్ టీడీపీని వీడిన విషయం తెలిసిందే. ఆయన కోరికను జగన్ వెంటనే తీర్చేశారు. దీంతో ఇప్పుడు దేవినేని అవినాష్ సత్తా చూపిస్తాడా? తన తండ్రి పలుకుబడిని, అను చరగణాన్ని, ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకుంటాడా? అనేప్రశ్నలు తెరమీదికి వస్తు న్నాయి.
పర్సనల్ ఓటు బ్యాంకు….
2014లో నెహ్రూ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా 24 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఇదంతా నెహ్రూ ఫ్యామిలీ పర్సనల్ ఓటు బ్యాంకే. ఇక ఆ ఎన్నికల్లోనే విజయవాడ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన దేవినేని అవినాష్‌కు 55 వేల ఓట్లు వచ్చాయి. ఇక, ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిని చూస్తే.. 2014 నుంచి ఇక్కడ టీడీపీ వరుస విజయాలు చూస్తోంది. పునర్విభజనలో 2009లో పూర్తి స్థాయి నగర నియోజకవర్గంగా మారిన తూర్పులో టీడీపీ పటిష్టంగా ఉంది. రెండుసార్లు వరుసగా విజయాలు సొంతం చేసుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అయిన గద్దె రామ్మోహన్‌కు కూడా ఇక్కడ మంచి పట్టుంది.
బలమైన నేతతో….
పార్టీ పరంగాను, కమ్యూనిటీ పరంగాను ఆయన మంచి నాయకుడిగా ఎదిగారు. వివాద రహితుడిగా, అవినీతి మరకలేని నాయకుడిగా ఆయన ప్రస్తానం సాగుతోంది. అదే సమయంలో అందరికీ అందుబాటులో ఉన్న నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి నాయకుడితో యువ నాయకుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఏరకంగా ఢీ అంటే ఢీ అంటారో చూడాలి. ఇక ప్రస్తుతం అవినాష్‌కు తూర్పు నియోజకవర్గ పగ్గాలు ఇవ్వడంతో ఇక్కడ దేవినేని అవినాష్ హవా స్టార్ట్ అయినట్టే. అయితే గద్దెను ఢీ కొట్టేందుకు దేవినేని అవినాష్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో పరిశీలించాలి. ఇప్పుడు బెజవాడలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.