అవినాష్ కు అక్కడ పట్టు చిక్కినట్లేనా?

బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దేవినేని నెహ్రూ వారసుడిగా పాలిటిక‌ల్ అరంగేట్రం చేసిన దేవినేని అవినాష్‌.. రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. స‌రైన వేదిక [more]

Update: 2020-08-09 15:30 GMT

బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దేవినేని నెహ్రూ వారసుడిగా పాలిటిక‌ల్ అరంగేట్రం చేసిన దేవినేని అవినాష్‌.. రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. స‌రైన వేదిక ల‌భించింద‌నే సంతోషంతోపాటు.. ఆయ‌న‌కు అన్ని ర‌కాలుగా కలిసి వ‌స్తున్న ప‌రిణామాల‌తో బెజ‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ సీపీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. నిజానికి అవినాష్ అతి పిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల్లో వ‌చ్చారు. ఇప్ప‌టకి మూడు పార్టీలు మారారు. తొలుత కాంగ్రెస్ త‌ర‌ఫున 2014లో విజ‌యవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభ‌జించింది అన్న వ్యతిరేక‌త ఉన్నా కూడా అవినాష్ ఎంపీగా పోటీ చేస్తే 55 వేల ఓట్లు వ‌చ్చాయి. త‌ర్వాత టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే తెలుగు యువత అధ్యక్షుడిగా కొన‌సాగారు. చంద్రబాబు చివ‌రి వ‌ర‌కు ఊరించి ఊరించి ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతోన్న వేళ అవినాష్‌కు ఆ ప‌ద‌వి క‌ట్టబెట్టారు.

వైసీపీలో చేరిన తర్వాత…..

క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అవినాష్‌.. దూకుడుతో నిజానికి టీడీపీలో యువ‌త బాగా క‌నెక్ట్ అయ్యారు. అనేక ప‌థ‌కాల‌ను యువ‌త‌లోకి తీసుకువెళ్లారు. అయితే అవినాష్‌ను వాడుకోవ‌డం టీడీపీ అధిష్టానానికి చేత‌కాలేద‌నే చెప్పాలి. ఎన్నిక‌ల వేళ చివ‌ర్లో కొడాలి నానిపై పోటీ చేసేందుకు ఎవ్వరూ లేనిప‌క్షంలో అవినాష్ బ‌ల‌మైన క్యాండెడ్ అవుతార‌ని భావించి గుడివాడ నుంచి 2019 ఎన్నిక‌ల్లో రంగంలోకి దింపారు. అయితే, త‌న కుటుంబానికి క‌లిసి వ‌చ్చిన తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కాకుండా చంద్రబాబు గుడివాడ కేటాయించినా.. ఎక్కడా శ‌క్తి వంచ‌న లేకుండా అవినాష్ కృషి చేసి విజ‌యానికి ప్రయ‌త్నించారు. కానీ, టీడీపీలోనే గ్రూపులు ఏర్పడి.. అవినాష్ ఓట‌మికి దారితీసేలా తెర‌చాటు వ్యవ‌హారాలు న‌డిచాయ‌ని అంటారు. దీంతో విసుగెత్తిన అవినాష్‌.. కొన్నాళ్ల కింద‌ట వైఎస్సార్ సీపీలోచేరారు.

కరోనా సమయంలోనూ….

వ‌చ్చీరావడంతోనే అవినాష్ ఇష్టానికి ఇక్కడ పెద్దపీట ప‌డింది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కావాల‌న్న అవినాష్ కోరిక‌ను వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ స్వాగ‌తించారు. వెంట‌నే ఆయ‌న‌కు తూర్పు నియ‌జ‌క‌వ‌ర్గం పార్టీప‌గ్గాలు అప్పగించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన క‌మ్మ వ‌ర్గానికే చెందిన బొప్పన భ‌వ‌కుమార్ ఉన్నప్ప‌టికీ.. ఆయ‌న‌ను విజ‌య‌వాడ పార్టీ ఇంచార్జ్‌గా నియ‌మించి అవినాష్‌కు తూర్పు ఇంచార్జ్ బాధ్యత‌లు అప్పగించారు దీంతో అవినాష్ త‌న స‌త్తా నిరూపించుకునే ప‌నిలో ప‌డ్డారు. అత్యంత స్వల్ప వ్యవ‌ధిలోనూ యువ‌త‌ను చేరువ చేసుకున్నారు. పార్టీలో కీల‌కంగా మారారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. క‌రోనా వేళ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌ల‌కు ఎన్నో కార్యక్రమాలు చేప‌ట్టి మ‌రింత చేరువ అయ్యారు.

కాంట్రవర్సీ లేకుండా….

పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తున్నారు. రాజ‌కీయాల్లో అవినాష్ ఎప్పుడు కాంట్రవ‌ర్సీ కాలేదు. జిల్లా వైసీపీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా కూడా త‌న‌దైన శైలీలో ముందుక వెళుతున్నారు. ముఖ్యంగా తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, అదే క‌మ్మ వ‌ర్గానికిచెందిన గ‌ద్దె రామ్మోహ‌న్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే ప్రయ‌త్నం చేస్తున్నారు. అవినాష్‌కు మంచి ప్రయార్టీ ఇస్తోన్న జ‌గ‌న్ త్వర‌లోనే న‌గ‌ర పార్టీ ప‌గ్గాలు కూడా ఇవ్వవ‌చ్చన్న ప్రచారం జ‌రుగుతోంది. కార‌ణం ఏదైనా అవినాష్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కు త‌న‌కు ఎదురు లేద‌నుకున్న గ‌ద్దె ఇప్పుడు స్లో అయిన మాట వాస్తవం. ఇదే ఇప్పుడు బెజ‌వాడ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News