ఈ మాజీ మంత్రిని కాపాడుతున్న కమ్మ కార్డు..!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. కొందరికి కులం పేరిట కష్టాలు వెంటాడుతుంటే.. మరికొందరిని అదే కులం కార్డు కాపాడుతోందనే భావన వ్యక్తమవుతోంది. [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. కొందరికి కులం పేరిట కష్టాలు వెంటాడుతుంటే.. మరికొందరిని అదే కులం కార్డు కాపాడుతోందనే భావన వ్యక్తమవుతోంది. [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. కొందరికి కులం పేరిట కష్టాలు వెంటాడుతుంటే.. మరికొందరిని అదే కులం కార్డు కాపాడుతోందనే భావన వ్యక్తమవుతోంది. కృష్ణాజిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా ఇదే కులం కార్డు కాపాడుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్‌పైనా, ఆయన ప్రభుత్వంపైనా ఉమా ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉన్నారు. దేవినేని ఉమ 2004లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌పై అలు పెరగని పోరాటం చేసేవారు. ఆ తర్వాత అదే పంథాలో ముందుకు వెళ్లారు. ఇక జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన దేవినేని ఉమ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తీసుకున్న మూడు రాజధానుల ఎజెండాపై దేవినేని ఉమ నిప్పులు చెరిగారు.
ఉమకు చెక్ పెడుతుందని….
ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా దేవినేని ఉమకు చెక్ పెడుతుందని, ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను వివిధ కేసుల్లో జైలుకు పంపిన జగన్ సర్కారు.. ఇక, ఈ వరుసలో దేవినేని ఉమ కి కూడా చెక్ పెడుతుందని అనుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన జోలికి జగన్ కానీ, ఆయన మంత్రులు కానీ వెళ్లడం లేదు. పైగా మైలవరం నుంచి విజయం సాధించిన వసంత కృష్ణప్రసాద్ కూడా ఎన్నికలకు ముందు తర్వాత దేవినేనిపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ, ఇటీవల కాలంలో కేపీ కూడా మౌనం పాటిస్తున్నారు. దేవినేని ఉమ విమర్శించినా.. కూడా ఎక్కడా కేపీ కౌంటర్లు కూడా ఇవ్వడం లేదు. దీనికి కారణాలపై ఆరా తీస్తే.. కులం కార్డే దేవినేనిని కాపాడుతోందనే భావన వ్యక్తమవుతోంది.
అందుకే ఆగుతున్నారా?
ఇప్పుడు ఈ విషయం రాజధాని మీడియా, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ విషయంలో చేసిన దూకుడు, డాక్టర్ రమేష్‌బాబు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన శైలితో కమ్మ వర్గం తీవ్రంగా హర్ట్ అయింది. ఇప్పుడు దేవినేని ఉమపై పోలవరం ప్రాజెక్టు అవినీతిని మోపి.. చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇలా చేస్తే.. రాజధాని జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆధిపత్యంలో ఉన్న కమ్మవర్గం వైసీపీకి దూరమయ్యే ప్రభావం ఉందని వైసీపీ నాయకులు భావిస్తున్నారట. దీంతో ఇప్పటికిప్పుడు దేవినేని ఉమపై చర్యలు వద్దని అనుకుంటున్నట్టు వైసీపీ వర్గాల్లో టాక్. ఇదీ సంగతి.