దేవినేని ఎస్కేప్ వెనక ఇంత జరిగిందా ?
స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీకి కీలకమైన నాయకులు చాలా మంది కలిసి రాలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది నిజం కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు [more]
స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీకి కీలకమైన నాయకులు చాలా మంది కలిసి రాలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది నిజం కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు [more]
స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీకి కీలకమైన నాయకులు చాలా మంది కలిసి రాలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది నిజం కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు ముందే కాడి కింద పడేశారు. కృష్ణా జిల్లాను తీసుకుంటే.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై పార్టీ అధినేత చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో జరిగిన నగర పాలక సంస్థల్లోనూ, విజయవాడ కార్పొరేషన్‌లోనూ ఆయన దూకుడుగా వ్యవహరిస్తారని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయన ఈ విషయంలో చేతులు ఎత్తేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నగర రాజకీయాల్లో కాళ్లు, వేళ్లు పెట్టేసిన దేవినేని ఉమా ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలను మాత్రం పట్టించుకోలేదు.
తన వర్గం వారికి…..
పంచాయతీ ఎన్నికల్లోనూ నందిగామ, మైలవరం నగర పాలక సంస్థల్లోనూ దేవినేని ఉమా హవా పెద్దగా కనిపించలేదు. విజయవాడకు వచ్చేసరికి గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని ముందుండి నడిపించారు. అప్పట్లో కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు బాగానే కృషి చేశారు. ఫలితంగా కార్పొరేషన్‌లో టీడీపీ పుంజుకుంది. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దేవినేని ఉమా అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి.. అన్నవిధంగా పరిస్థితి మారిపోయింది. కొన్ని వార్డుల్లో ఆయన తనకు అనుకూలంగా వున్న వారికి కార్పొరేటర్ సీట్లు ఇప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు.
ఆర్థిక సాయం అందిచడానికి కూడా….
అయితే దేవినేని ఉమా మాటను ఇటు స్థానిక నాయకులే కాకుండా… అటు అధిష్టానం సైతం పట్టించుకోలేదు. దీనికి ప్రధాన కారణం దేవినేని ఉమా వేలు పెడితే ఒప్పుకోనని కేశినేని ముందే చెప్పేశారట. దీనికి తోడు స్థానిక నేతలు కూడా దేవినేని ఉమాను ఆర్థికంగా కొంత సాయం చేయాలని కోరినా ఆయన వెనక్కు తగ్గారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఉమా ఇప్పుడు నగరంలో తన అనచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు ముందుకు వచ్చినంత స్పీడ్‌గా… ఆర్థిక సాయం విషయంలో ముందుకు రాకపోవడం… ఇక్కడే కేశినేని అడ్డు పుల్ల వేయడంతో దేవినేని ఉమాకు కార్పొరేషన్లో ఏ మాత్రం స్పేస్ దొరకలేదని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
ఎన్నికల ప్రచారంలోనూ….
దేవినేని ఉమాకు నగరంలో ఎప్పటి నుంచో ఓ వర్గం ఉంది. కనీసం వారికి కూడా ఈ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లు ఇప్పించుకోలేకపోయారు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో రంగంలో ఉన్న ఆయన తొలి రోజే ప్రచారం మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ప్రధానంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుని.. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది నేతలు ఎస్కేప్ అవుతున్నారు. దేవినేని ఉమా కూడా ఈ లిస్టులోనే చేరిపోయాడట.