చెబితే కాస్త జనం నమ్మేట్టు ఉండాలయ్యా?

ఏదైనా చెబితే దానికర్థం ఉండాలి. నమ్మేటట్లు ఉండాలి. చెబితే అతికినట్లు ఉండాలి. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ చెప్పింది చూస్తుంటే అతకనట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి [more]

Update: 2021-04-30 08:00 GMT

ఏదైనా చెబితే దానికర్థం ఉండాలి. నమ్మేటట్లు ఉండాలి. చెబితే అతికినట్లు ఉండాలి. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ చెప్పింది చూస్తుంటే అతకనట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌పై మార్ఫింగ్‌ వీడియో చేయించింది టీడీపీ అధినేత చంద్రబాబే నని చెబితే పంపిమని సీఐడీ అధికారులు తనపై వత్తిడి తెచ్చారంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీటెక్కాయి. సీఐడీ అధికారులు తనను బెదిరించారని దేవినేని ఉమ చెబుతున్నారు.

బాబుకు సన్నిహితుడుగా….

దేవినేని ఉమ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. పైగా సామాజికవర్గమూ సేమ్ టు సేమ్. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పేరును ఇరికించాలని దేవినేని ఉమపై సీఐడీ అధికారులు వత్తిడి తెస్తారా? అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. ప్రధానంగా సీఐడీని, ప్రభుత్వాన్ని బద్నాం చేయడంతోపాటు చంద్రబాబుకు సింపతీని సాధించిపెట్టేందుకే దేవినేని ఉమ ఈ వ్యాఖ్యలు చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

పార్టీ నేతల నుంచి…

దేవినేని ఉమ తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక‌లో ప్రచారం కోసం వ‌చ్చిన ఆయ‌న‌ ముఖ్యమంత్రి జ‌గ‌న్ కేంద్రంగా విమ‌ర్శలు చేశారు. ఒక వీడియోను కూడా ప్రద‌ర్శించారు. అయితే అది మార్పింగ్ వీడియోగా ఫిర్యాదు అందడంతో దేవినేని ఉమ పై సీఐడీ కేసు నమోదు చేసింది. విచారణకు పిలిపించింది. కానీ ఇక్కడ దేవినేని ఉమ ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. పార్టీ నుంచి నేతల నుంచి ఆయనకు పెద్దగా అండ దొరకకపోవడమే.

జిల్లా నేతలు కూడా…?

మిగిలిన టీడీపీ నేతలపై కేసులు నమోదయినప్పుడు అనేక మంది స్పందించారు. కానీ దేవినేని ఉమ విషయంలో చంద్రబాబు, లోకేష్ మినహా ఎవరు స్పందించలేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమ కు మద్దతుగా నిలబడలేదు. ఆయన జిల్లా పార్టీలో ఒంటరిగానే మిగిలిపోయారు. అందుకే తనపైన, చంద్రబాబుపైన సానుభూతి వచ్చేందుకు తనను బెదిరించారని, చంద్రబాబు పేరు చెప్పమన్నారని ఆయన మీడియాకు వివరించారంటున్నారు. చంద్రబాబు పై ఇప్పటికే సీఐడీ అమరావతి భూముల విషయంలో కేసు నమోదు చేసిందని, దేవినేని వన్నీ డ్రామాలనీ వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

Tags:    

Similar News