Dharmana : మంత్రి పదవి ఇవ్వకపోతే మామూలుగా ఉండదట

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పట్లో మౌనం వీడేటట్లు లేరు. మంత్రి వర్గ విస్తరణ తర్వాతనే ఆయన తన వైఖరిని బయటపెట్టే అవకాశముంది. సీనియర్ నేతగా తనకు [more]

Update: 2021-10-14 15:30 GMT

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పట్లో మౌనం వీడేటట్లు లేరు. మంత్రి వర్గ విస్తరణ తర్వాతనే ఆయన తన వైఖరిని బయటపెట్టే అవకాశముంది. సీనియర్ నేతగా తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆయన గట్టిగా భావిస్తున్నారు. తొలివిడతలో రావాల్సి ఉన్నా సోదరుడికి రావడంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఛాన్స్ తనకే నన్న పూర్తి విశ్వాసంతో ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. అందుకే ఆయన ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

సీనియర్ నేతగా…

శ్రీకాకుళం జిల్లా అంటేనే రాజకీయంగా గుర్తొచ్చేది. రెండే కుటుంబాల పేర్లు. ఒకటి ధర్మాన, మరొకటి కింజారపు. ఈ రెండు కుటుంబాలే జిల్లాను రెండు పార్టీల్లో శాసిస్తున్నాయి. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావును కొట్టే వ్యక్తి లేరు. ఆయనే మంత్రి. కాంగ్రెస్ లో సమయం మిగిలి ఉండటంతో ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరారు.

కుటుంబం పరువు కోసం…

ఇదిలా ఉంటే జగన్ యువతకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించడం ధర్మాన ప్రసాదరావుకు కొంత ఇబ్బందిగా మారింది. తన కుటుంబాన్ని కాదని వేరే వారికి మంత్రి పదవి ఇస్తే పరువు పోతుందని ఆయన సతమతమవుతున్నారు. అయితే మంత్రి పదవి విషయంలో జగన్ ను కలిసేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదు. ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు విపక్షం మీద విమర్శలు చేయడంలో ముందుంటారు. అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ ధర్మాన ప్రసాదరావు సేవలను వినియోగించుకుంటారు.

గొంతు పెంచుతారా?

ఈసారి తనకు మంత్రి పదవి దక్కకపోతే ఆయన బరస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం వైఖరి పట్ల ధర్మాన ప్రసాదరావు అసంతృప్తితో ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో కూడా తనను సంప్రదించడం లేదని చెబుతున్నారు. బయట వ్యక్తులు పార్టీని శాసించడమేంటని ఆయన పలు సందర్భాల్లో మండిపడ్డారు. అందుకే ఆయన వేచిచూసే ధోరణిలో ఉన్నారు. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. మంత్రి పదవి దక్కదని తెలిసిన మరుసటి రోజే ధర్మాన ప్రసాదరావు తన గొంతును పెంచుతారంటున్నారు. మరి జగన్ ఆయనకు మంత్రి పదవి ఇస్తారో? లేదో? అన్నది చూడాలి.

Tags:    

Similar News