ఈయన మేయర్… ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ ?
తండ్రుల రాజకీయ దీపాలు అలా వెలుగుతూ ఉండగానే తనయులు కూడా కళకళలాడాలని తెగ ఆశపడుతున్నారు. దానికి తండ్రుల నుంచి వస్తున్న మద్దతుతో తెగ దూకుడు చేస్తున్నారు. శ్రీకాకుళం [more]
తండ్రుల రాజకీయ దీపాలు అలా వెలుగుతూ ఉండగానే తనయులు కూడా కళకళలాడాలని తెగ ఆశపడుతున్నారు. దానికి తండ్రుల నుంచి వస్తున్న మద్దతుతో తెగ దూకుడు చేస్తున్నారు. శ్రీకాకుళం [more]
తండ్రుల రాజకీయ దీపాలు అలా వెలుగుతూ ఉండగానే తనయులు కూడా కళకళలాడాలని తెగ ఆశపడుతున్నారు. దానికి తండ్రుల నుంచి వస్తున్న మద్దతుతో తెగ దూకుడు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయల విషయానికి వస్తే ధర్మాన ఫ్యామిలీకి పొలిటికల్ గా మంచి పేరు ఉంది. అంతే కాదు, గత కొన్ని పర్యాయాలుగా అన్నదమ్ములు ఇద్దరూ శాసనసభలో కనిపిస్తున్నారు. ఇక తాజా అసెంబ్లీలో ధర్మాన క్రిష్ణ దాస్ డిప్యూటీ సీఎంగా ఉంటే సీనియర్ ఎమ్మెల్యేగా ప్రసాదరావు ఉన్నారు. ఇక వీరి వారసులు కూడా శ్రీకాకుళం జిల్లాలో స్పీడ్ బాగా పెంచేశారు.
తొలి మేయర్ గా….?
ధర్మాన ప్రసాదరావు ఇపుడు పెద్దగా యాక్టివ్ గా లేరు అని అంటున్నారు. కానీ ఆయన రాజకీయమే వేరు. తాను తిరగాల్సిన చోట తనయుడు రామ్ మనోహర్ నాయుడుకి తిప్పుతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాకుళం మొత్తం రాజకీయాన్ని తనయుడి చేతిలో పెట్టేశారు తొందరలో శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికలలో మేయర్ గా తన కుమారుడిని నిలబెట్టి గెలిపించుకోవాలని తెర వెనక ప్రసాదరావు పావులు కదుపుతున్నారు. ఇది సొంత పార్టీలోని వారికే షాక్ ఇచ్చే పరిణామంగా ఉంది.
జెడ్పీ ఆయనదే…
మరో వైపు జెడ్పీ చైర్మన్ మహిళా రిజర్వేషన్ అయింది. అయితే రెండు వైస్ చైర్మన్ పదవులు వస్తాయి. అందులో ఒకటి తన తనయుడుకి ఇప్పటికే రిజర్వ్ చేయించి పెట్టేశారు ధర్మాన కృష్ణ దాస్. అంటే జిల్లా పెత్తనం తన కుమారుడి ద్వారానే చేయాలని ఆయన ఉబలాటపడుతున్నట్లుగా అర్ధమవుతోంది. దీని కోసం నరసన్న పేట నుంచి జెడ్పీటీసీగా కూడా డాక్టర్ క్రిష్ణ చైతన్య పోటీ చేశారు. ఈ ఫలితాలు వచ్చాక ఆయన వైఎస్ చైర్మన్ కావడం లాంఛనమే అంటున్నారు. ఆ విధంగా కొడుకుకి అధికార పదవి అప్పచెప్పి భావి వారసుడిగా తీర్చిదిద్దాలని క్రిష్ణ దాస్ భావిస్తున్నారు.
ఫ్యూచర్ లో అంతే …
ఇప్పటికే ఎర్రన్నాయుడు కుమారుడు గా రామ్మోహన్ నాయుడు ఎంపీ అయి చక్రం తిప్పుతున్నారు. త్వరలో అచ్చెన్నాయుడు వారసుడు కూడా రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారసుడు చిరంజీవి నాగ్ కూడా రేసులో ఉన్నారు. దీంతో భవిష్యత్తులో కూడా సిక్కోలు రాజకీయం అంతా కూడా ఈ మూడు బడా ఫ్యామిలీల మధ్యనే తిరుగుతుంది అంటున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ, టీడీపీలలో ఆశావహులు మాత్రం ఖంగు తింటున్నారు. అన్ని పదవులూ పెద్ద కుటుంబాలకే పోతే తమ సంగతేంటని వారు మండిపడుతున్నారు. కానీ రాజకీయం వారసత్వం పెనవేసుకుని పోయిన నేపధ్యంలో ఇది అనివార్యమే అంటున్నారు.