కెలుక్కున్నాడు…. బుక్ అయ్యాడే
ధర్మాన ప్రసాదరావు. సీనియర్ మోస్ట్ నాయకుడు. వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన దిట్ట. అలాంటి నాయకుడు ఇటీవల జరిగిన ఓ చిన్న పొరపాటు కారణంగా [more]
ధర్మాన ప్రసాదరావు. సీనియర్ మోస్ట్ నాయకుడు. వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన దిట్ట. అలాంటి నాయకుడు ఇటీవల జరిగిన ఓ చిన్న పొరపాటు కారణంగా [more]
ధర్మాన ప్రసాదరావు. సీనియర్ మోస్ట్ నాయకుడు. వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన దిట్ట. అలాంటి నాయకుడు ఇటీవల జరిగిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఇమేజ్‌ను పోగొట్టుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావు రాజకీయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు జగన్ కేబినెట్‌లో సీటు ఆశించారు. అయితే, అది దక్కలేదు. దీంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంటున్నారు.
వర్తక సంఘం విషయంలో….
అసెంబ్లీలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే, జిల్లాలో రాజకీయాలను శాసించే రీతిలో ఉన్న వర్తక సంఘం విషయంలో ఇటీవల ధర్మాన ప్రసాదరావు జోక్యం జోక్‌గా మారిందని అంటున్నారు పరిశీలకులు. శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలో నాలుగు వర్గాలున్నాయి. వీటిలో మూడు వర్గాలు అధికార వైసీపీకి, మద్దతు తెలుపుతుండగా, మిగిలిన ఒక్క వర్గం మాత్రం టీడీపీ తరఫున నిలబడుతోంది. అయితే, అధికారంలో ఉన్నాం కాబట్టి, మిగిలిన ఆ ఒక్క వర్గాన్నీ తమవైపు తిప్పికోవాలని వైసీపీకి చెందిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ వర్గాన్ని తమ వైపునకు…..
ఈ క్రమంలోనే వర్తక సంఘం వ్యవహారంలో జోక్యం చేసుకుని టీడీపీ వర్గంగా ఉన్న వర్తక సంఘాన్ని వైసీపీ వైపుతిప్పితే ఇక తమకు తిరుగు ఉండదని వైసీపీ మద్దతు దారులు చెప్పడంతో ధర్మాన ప్రసాదరావు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. అభివృద్ధి జరగాలంటే వర్తక సంఘంలో ఎమ్మెల్యేకు అనుకూలమైన ప్రతినిధే ఉండాలనే విషయాన్ని ప్రచారం చేయించారు. దీంతో ఒక్కసారిగా వర్తక సంఘం విషయంలో ధర్మాన ప్రసాదరావు జోక్యంపై తీవ్ర వివాదం రేగింది. వైసీపీలోని ఓ వర్గం వర్తకులు ధర్మాన జోక్యాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇక, టీడీపీ అనుకూల వర్గం మాత్రం లైట్‌గా తీసుకుంది.
జోక్యం సహించేది లేదని…..
శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంలోని ధర్మాన ప్రసాదరావు వర్గం, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ధర్మాన ప్రసాదరావుకు అనుకూలంగా ఉన్న వర్గం నుంచి 20 మంది వచ్చి రక్తదానం చేస్తే.. మరోవర్గం నుంచి 200 మంది వచ్చి దానం చేశారట. దీంతో వర్తక సంఘం విషయంలో ధర్మాన ప్రసాదరావు జోక్యం సహించేది లేదని పరోక్షంగా వర్తక సంఘం చెప్పినట్టయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు చాలా ఆసక్తిగా మారడంతోపాటు ధర్మాన ప్రసాదరావు విషయంలో ఇక్కడి వారు చురకలు అంటించారని అంటున్నారు పరిశీలకులు.