పొన్నూరులో మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నారా?
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ఇక్కడ గట్టి పట్టున్న నాయకుడు, టీడీపీ నేత, ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర [more]
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ఇక్కడ గట్టి పట్టున్న నాయకుడు, టీడీపీ నేత, ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర [more]
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ఇక్కడ గట్టి పట్టున్న నాయకుడు, టీడీపీ నేత, ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక ఇక్కడ నుంచి ఎవరూ గెలవరు అనుకున్న తరుణంలో వైసీపీ తరపున పోటీ చేసిన కిలారి రోశయ్య విజయం సాధించారు. దీంతో వైసీపీ పుంజుకుందని అందరూ అనుకున్నారు. ఇక, ఇప్పుడు స్థానిక ఎన్నికలు తెరమీదికి వచ్చాయి. దీంతో ఎవరి సత్తా ఏంటో బయట పడుతుందని ఇప్పటికే ధూళిపాళ్ల ప్రకటించారు. గత ఎన్నికల్లో బాబు ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు జగన్ సునామీ కూడా పనిచేసిందని అందుకే తాను ఓడిపోయానని ఆయన అంటున్నారు.
సత్తా తగ్గలేదని.. స్వల్ప ఓట్లతోనే…?
1994 నుంచి 2014 వరకు వరుసగా ఓటమి లేకుండా ఐదుసార్లు గెలిచిన నరేంద్ర గత ఎన్నికల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చినా కేవలం 1000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని.. అంతేతప్ప తన సత్తా ఎక్కడా తగ్గలేదని అంటున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఆయన సతీమణి కూడా ప్రజల్లోకి వచ్చారు. రాజధాని ఆందోళనలకు భార్యాభర్తలు ఇద్దరూ కూడా మద్దతిస్తున్నారు. కుదిరినప్పుడ ల్లా వెళ్లి ప్రసంగాలు చేస్తున్నారు. ధర్నాలు, నిరసనల్లో పాల్గొనేవారికి ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లి కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇలా ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్య మాత్రం ఉంటున్నారు.
గెలిచి జగన్ కు?
ఓడిపోయాక ధూళిపాళ్ల నరేంద్రలో ఉన్న దూకుడు అధికారంలో ఉన్నప్పుడు లేకపోవడం గమనార్హం, ఇక, వైసీపీఎమ్మెల్యే రోశయ్య విషయానికి వస్తే ఎన్నికలకు ముందు ప్రజల్లో తిరిగిన ఆయన తర్వాత ప్రజల మధ్యకు వెళ్లడం మానేశారు. ఒకటి తన వ్యాపారాలు, రెండు రాజధాని రగడ జరుగుతుండడంతో ఆయన తప్పుకొన్నారు. అయితే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు రావడం, తనకు జగన్ దగ్గర మంచి మార్కులు ఉండడంతో ఇప్పుడు గెలిచి సత్తా చాటుకోకపోతే జగన్ దగ్గర పరువు పోతుందనే భావనలో రోశయ్య ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలోకి రాకపోయినా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయినా ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
చావో రేవో అన్నట్లు….
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి కావడంతో ఇక్కడ వైసీపీ గెలుపు అంత సలువు కాదన్నది అర్థమవుతోంది. ఈ క్రమంలో అటు ధూళిపాళ్ల వర్గం, ఇటు రోశయ్య వర్గం రెండూ కూడా హోరా హోరీ తలపడేందుకు రెడీ అయ్యాయి. స్థానికంగా ధూళిపాళ్లకు పట్టున్న ఏరియాల్లో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. రోశయ్య విషయంలో మాత్రం ఇంకా ప్రచారం ప్రారంభం కాలేదు. దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచినా రోశయ్య మాత్రం ఎదురీద ఎదుర్కొనక తప్పదనే భావన ఎదురవుతోంది.