తెలిసి తప్పు చేసిన పాక్ ?

  మాంచెస్టర్ వన్డే లో విజయం సాధించడం భారత్ పై ప్రపంచ కప్ లో అతి చెత్త రికార్డ్ నమోదు చేసుకున్న పాకిస్థాన్ కి అత్యంత అవసరం. [more]

Update: 2019-06-17 03:30 GMT

 

మాంచెస్టర్ వన్డే లో విజయం సాధించడం భారత్ పై ప్రపంచ కప్ లో అతి చెత్త రికార్డ్ నమోదు చేసుకున్న పాకిస్థాన్ కి అత్యంత అవసరం. ఈ మ్యాచ్ కి ముందు రెండు టీం లు హోరాహోరీగా ప్రాక్టీస్ చేశాయి. వరుణుడి వల్ల మ్యాచ్ జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అందరికి తెలిసిందే. టాస్ గెలిచి ప్రత్యర్థికి బౌలింగ్ అప్పగించి భారీ స్కోర్ నమోదు చేస్తే మధ్యలో వర్షం వచ్చినా డక్ వర్త్ లూయిస్ నిబంధనలు ముందు బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ శాతం అనుకూలంగా వుండే ఛాన్స్ ఉంటుంది. ఇన్ని తెలిసినా పాక్ కెప్టెన్ సర్పారాజ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ లో దూకుడు మీద దూసుకుపోతున్న ఇండియా కు బ్యాటింగ్ అప్పగించి పప్పులో కాలేశాడు.

సర్పరాజ్ పై పాక్ లో ఆగ్రహం …
ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పాక్ క్రీడాభిమానులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. అయితే పిచ్ లో వున్న కొద్దిపాటి తేమను సద్వినియోగం చేసుకుని ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను వరుసగా పెవిలియన్ బాట పట్టించే అవకాశం దుమ్మురేపే బౌలింగ్ దళం వున్న పాక్ కు వుంది. ఈ బలంతోనే సర్పరాజ్ ఇండియా ను బ్యాటింగ్ కి దింపి ఓటమి చేజేతులా కొని తెచ్చుకుని వత్తిడితో కూడిన సెకండ్ బ్యాటింగ్ చేశారని పాక్ మీడియా సైతం దుమ్మెత్తిపోస్తుంది. వీరి గోల అలా ఉంటే ఇప్పటివరకు ప్రపంచకప్ లో ఇండియా ను పాక్ ఓడించిన రికార్డ్ లేదు. ఎప్పుడు భారత్ గెలుస్తూనే వస్తుంది. తాజా మ్యాచ్ లో ఏడోసారి కూడా పాక్ ను చిత్తు చేసి కోహ్లీ సేన పాత రికార్డ్ ను పదిలంగా ఉంచింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా టీం ఇండియా అంతు చూడాలని దిగిన పాక్ మాత్రం డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 89 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని పొంది, స్వదేశంలో ఘోర అవమానాన్ని ఎదుర్కోక తప్పలేదు. పాక్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే మాత్రం టాస్ గెలిచి రిస్క్ తీసుకుని బౌలింగ్ చేపట్టిన తమ కెప్టెన్ ను అక్కడివారు ఆకాశానికి ఎత్తేసేవారేమో.

Tags:    

Similar News