అత్త గుట్టును అల్లుడు…?

నడిగడ్డలో అత్తా అల్లుళ్లు సవాల్ విసురుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉండటంతో మహబూబ్్ నగర్ జిల్లాలో అత్తా అల్లుళ్ల సమరం ఆసక్తిగా [more]

Update: 2019-12-19 09:30 GMT

నడిగడ్డలో అత్తా అల్లుళ్లు సవాల్ విసురుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉండటంతో మహబూబ్్ నగర్ జిల్లాలో అత్తా అల్లుళ్ల సమరం ఆసక్తిగా మారింది. నడిగడ్డ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల నయోజకవర్గం. గద్వాల అంటే నిన్న మొన్నటి వరకూ గుర్తొచ్చేది డీకే అరుణ. డీకే అరుణ కుటుంబానికి గద్వాలలో ఉన్న పట్టు మరెవరకి లేదు. గద్వాల కోట డీకే కుటుంబం చేతిలోనే ఉండేది.

గద్వాల అంటేనే…?

గద్వాలలో గతలో డీకే సమరసింహారెడ్డి, డీకే భరత్ సింహారెడ్డిలు రాజకీయాలు నడపేవారు. వీరిద్దరే గద్వాల రాజకీయాలను శాసించారు. ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి డీకే అరుణ వచ్చారు. డీకే అరుణ గద్వాల నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి గద్వాల రాజకీయాలను ఆమే చూసుకుంటున్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం గద్వాల రాజకీయాలు మారిపోయాయి. డీకే అరుణ మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

అల్లుడు గెలవడంతో….

2018 ఎన్నికల్లో తన అత్త డీకే అరుణ మీద టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. డీకే అరుణ ఓటమి తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పోయారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మేనల్లుడు మీద ఓటమి పాలు కావడంతో డీకే అరుణ బీజేపీలో చేరి యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లో మాత్రమే కాదు డీకే కుటుంబ వ్యాపారాల్లోనూ వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది.

మద్యం దుకాణాలన్నీ…..

ఇటీవల తెలంగాణలో మద్యనిషేధాన్ని చేయాలంటూ డీకే అరుణ దీక్ష చేపట్టారు. మద్యం వల్లనే మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అయితే డీకే అరుణ దీక్షపై మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి మండిపడుతున్నారు. డీకే ఫ్యామిలీ రాజకీయం మద్యంతోనే ప్రారంభ మయిందని విమర్శించారు. డీకే బంగళా రాజకీయ పునాదులు మద్యంతోనే ప్రారంభయ్యాయని కృష్ణమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. గద్వాల చుట్టూ డాబాలు, మద్యం షాపులను పెట్టించింది డీకే కాదా? అని ప్రశ్నింాచారు. ఇప్పటీకే డీకే కుటుంబానికి మద్యం దుకాణాలు న్నాయన్నారు. ఇలా అత్తా అల్లుళ్ల మధ్య వార్ పీక్ స్టేజీకి చేరుకుంది. రాజకీయాలతో పాటు వ్యాపారాల గుట్టును కూడా విప్పేసుకుంటున్నారు.

Tags:    

Similar News