ఈసారి ఒంటిచేత్తోనే “ఢంకా” మోగిస్తారట

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. దీనికి కారణం సీట్లను తగిన సంఖ్యతో [more]

Update: 2021-03-01 18:29 GMT

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. దీనికి కారణం సీట్లను తగిన సంఖ్యతో తమ మిత్ర పక్షాలకు కేటాయించలేక పోవడమే. సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాకపోయినా, వస్తున్న సంకేతాలను బట్టి కూటమిలోని పార్టీలో తమ దారిని తాము చూసుకుంటున్నాయి. అన్నాడీఎంకేలోని ప్రధాన పార్టీ డీఎండీకే కూడా ఒంటరిపోరుకే సిద్దమయింది.

ఆశించిన స్థానాలు…

సినీనటుడు విజయ్ కాంత్ స్థాపించిన డీఎండీకే ఈసారి ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్దమవుతుంది. తాము ఆశించిన స్థానాలను అన్నాడీఎంకే ఇవ్వకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. పీఎంకే కు ఇచ్చిన ప్రాధాన్యత తమ పార్టీకి అన్నాడీఎంకేకు ఇవ్వకపోవడం కూడా డీఎండీకే అధినేత విజయకాంత్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని విజయ్ కాంత్ సిద్ధమయినట్లే కనపడుతుంది.

అన్నాడీఎంకే లైట్ తీసుకోవడంతో….

గత కొద్దిరోజులుగా విజయ్ కాంత్ అన్నాడీఎంకే నుంచి స్పష్టత వస్తుందేమోనని ఎదురు చూశారు. తన బలాన్ని, బలగాన్ని అన్నాడీఎంకే ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. దాదాపు అరవై స్థానాల వరకూ డీఎండీకే ఆశిస్తుంది. అయితే అన్ని స్థానాలను ఇవ్వలేమని అన్నాడీఎంకే అధినాయకత్వం సంకేతాలను ఇచ్చిందంటున్నారు. దీంతో విజయ్ కాంత్ ఈసారి ఎన్నికల్లో ఢంకా భజాయించేందుకు సిద్ధమవుతున్నారు.

తమిళనాడు, పుదుచ్చేరిలోనూ…..

ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ డీఎండీకే తరుపున 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు రెడీ అయిపోయారు. విజయ్ కాంత్ గుర్తు ఢంకా తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది. గుర్తు కోసం అభ్యర్థులు కూడా అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఒంటరిగా పోటీ చేయాలని డీఎండీకే అధినేత విజయ్ కాంత్ నిర్ణయించారు. చివరి నిమిషంలో అన్నాడీఎంకే దిగివస్తే తప్ప విజయ్ కాంత్ ఒంటరిపోరుపై పునరాలోచించే అవకాశం లేదంటున్నారు.

Tags:    

Similar News