బాస్ వెంటే నడుస్తారా…?

రాజ‌కీయాల్లో గురువు ఎటు వెళ్తే.. శిష్యుడు ఆ బాట ప‌ట్టడం కొత్తకాదు. ఇటీవ‌ల టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్రముఖ పారి శ్రామిక వేత్త, చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా [more]

Update: 2019-07-25 05:00 GMT

రాజ‌కీయాల్లో గురువు ఎటు వెళ్తే.. శిష్యుడు ఆ బాట ప‌ట్టడం కొత్తకాదు. ఇటీవ‌ల టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్రముఖ పారి శ్రామిక వేత్త, చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా మెలిగిన ఎంపీ సుజ‌నా చౌద‌రి.. పార్టీ మారిపోయారు. దీంతో ఆయ‌న శిష్యుడు, గుంటూరు జిల్లా బాప‌ట్ల నుంచి పోటీ చేసి తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన అన్నం స‌తీష్ ప్రభాక‌ర్ కూడా గురువునే అనుసరించాడు., ఆయ‌న కూడా పార్టీ మారిపోయారు. నిజానికి ఎమ్మెల్సీ ప‌ద‌వి మ‌రో నాలుగు సంవ‌త్సరాలు ఉన్నప్పటికీ.. ఆయ న దానిని సైతం త్యజించి.. బాబుకు బై చెప్పారు. ఇలా రాజ‌కీయాల్లో చాలా మంది మ‌న‌కు తార‌స‌ప‌డ‌తారు. తాజాగా ఇలాంటి గురు శిష్యులే.. మ‌రోసారి రాజ‌కీయ తెర‌మీద చ‌ర్చకు వ‌చ్చారు.

రాయపాటి మారితే…

గుంటూరుకు చెందిన కీల‌క రాజ‌కీయ నాయ‌కుడు, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. అనేక మార్లు ఎంపీగా గెలిచిన ఆయ‌న .. తాజాగా టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి జ‌గ‌న్ సునామీ ముందు ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఆయ‌న పార్టీ మారిపోయేందుకు రెడీ అయ్యారు. త్వర‌లోనే ఆయ‌న బీజేపీ గూటికి చేరుకుంటున్నారు. అయితే, ఇదేస‌మ‌యంలో ఆయ‌న పెంచి పోషించి, రాజ‌కీయంగా ద‌శ -దిశ ఏర్పాటు చేసిన శిష్యుడు డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చకు వ‌చ్చింది. గురువు పార్టీ మారుతున్నాడు కాబ‌ట్టి.. శిష్యుడు కూడా పార్టీ మారిపోతారా? అనే చ‌ర్చ న‌డుస్తోంది.

అన్నీ తానే అయి….

2004లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినడొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ ను అన్నీతానై న‌డిపించారు రాయ‌పాటి. 2004లో కాంగ్రెస్ త‌ర‌ఫున టికెట్ ఇప్పించారు. ఇక‌, 2009లో మ‌రోసారి గెలిపించి ఏకంగా మంత్రి వ‌ర్గంలో బెర్త్ ద‌క్కేలా చేశారు. ఈ రెండు సార్లు కూడా డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ తాడికొండ నుంచి విజ‌యం సాధించ‌డంలో రాయ‌పాటి పాత్ర మ‌రువ‌లేనిది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు కేరాఫ్ లేకుండా పోవ‌డంతో ఆ స‌మ‌యంలో వైసీపీలోకి వెళ్లిపోవాల‌ని నిర్ణయించుకున్న డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ ను టీడీపీ వైపు న‌డిపించింది కూడా రాయ‌పాటే. అంతేకాదు, చంద్రబాబుతో మాట్లాడి డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ కు ఎమ్మెల్సీ సీటు కూడా ఇప్పించారు.

పట్టుబట్టి టిక్కెట్ ఇప్పించుకున్నా….

ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో తాడికొండ టికెట్ కోసం డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ విఫ‌ల ప్రయ‌త్నాలు చేశారు. అది ద‌క్కక‌పోవ‌డంతో ప‌ట్టుబ‌ట్టి.. రాయ‌పాటి ఆయ‌న‌కు ప్రత్తిపాడు టికెట్ ఇప్పించుకున్నారు. ఇలా గురు-శిష్యుల మ‌ధ్య రాజ‌కీయంగా చాలానే సంబంధం ఉంది. అయితే, ఈ ఇద్ద‌రూ కూడా జ‌గ‌న్ సునామీ ముందు ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి లేద‌ని గ్ర‌హించిన రాయ‌పాటి త‌న దారి తాను చూసుకుంటున్నారు.

గల్లాపై అసంతృప్తి…..

ఇక‌, టీడీపీలో తాను ఓడిపోయేందుకు సొంత పార్టీ నాయ‌కురాలు గ‌ల్లా అరుణ కుమారేన‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ పార్టీలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగానే ఉన్నా.. ఆయ‌న మాత్రం పెద్దగా పార్టీపై ఇంట్రస్ట్ చూపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో గురువు ఎలాగూ పార్టీ మారుతున్నాడు కాబ‌ట్టి, త‌న‌కు టీడీపీలో భ‌విత‌వ్యం ఉండ‌ద‌ని నిర్ధారించుకున్న నేప‌థ్యంలో డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ కూడా గురువుగారి బాట‌లోనే న‌డుస్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News