మరో బిగ్ వికెట్ వైసీపీలోకి?

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా దెబ్బ‌తిన్న విష‌యం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి రావాల‌ని భావించిన పార్టీ.. ఆమేర‌కు క‌స‌రత్తు చేసినా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. [more]

Update: 2019-10-23 12:30 GMT

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా దెబ్బ‌తిన్న విష‌యం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి రావాల‌ని భావించిన పార్టీ.. ఆమేర‌కు క‌స‌రత్తు చేసినా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. దీంతో ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అయితే, ఓడిపోయామ‌నే బాధ‌క‌న్నా కూడా ఇప్పుడు పార్టీ అధినేత చంద్ర‌బాబుకు మ‌రో బెంగ ప‌ట్టుకుంది. పార్టీలోని సీనియ‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా జంప్ చేస్తుండ‌డం ఆయ‌న‌ను క‌ల‌చి వేస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిన నాయ‌కులు ఇప్పుడు పార్టీకి రాం రాం చెప్పేందుకు రెడీ అవుతుండ‌డం చంద్రబాబుకు మ‌రింత శ‌రాఘాతంగా ప‌రిణ‌మిస్తోంది.

వైసీపీలో చేరతారా?

తాజాగా మాజీ మంత్రి డొక్కా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పైకి ఆయ‌న లేద‌ని, కాద‌ని అంటున్నా.. వ్యూహం ప్రకారం ఆయ‌న ఈ నెల‌లోనే వైసీపీ గూటికి బిచాణా మార్చేయ నున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకివెళ్తే.. డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు. సీనియ‌ర్ రా జకీయ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సీ నేత అయిన డొక్కా.. రాజ‌కీయ దిగ్గ‌జం.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు శిష్యుడు. ఆయ‌న ప్రో త్సాహంతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్‌లో తీర్థం పుచ్చుకుని వైఎస్ కు అనుచ‌రుడిగా మారారు.

వైఎస్ కు సన్నిహితుడిగా…

ఈ క్ర‌మంలోనే వైఎస్ మంత్రి వ‌ర్గంలో బెర్త్ ద‌క్కించుకుని, ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా కూడా చ‌క్రం తి ప్పారు. త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాలు మార‌డం, రాష్ట్ర విభ‌జ‌న అంశం చోటు చేసుకోవ‌డంతో కాంగ్రెస్ పూర్తిగా డీలా ప‌డింది. దీంతో ఆయ‌న వైసీపీ వైపు దృష్టి పెట్టారు. అయితే, డొక్కామాణిక్య వరప్రసాద్ రాజ‌కీయ గురువు.. రాయ‌పాటి సూచ‌న‌ల‌తో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు టికెట్ కూడా కేటాయించారు. వాస్త‌వానికి ఆయ‌న తాడికొండ కోరుకుంటే.. బాబు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ప్ర‌త్తిపాడుకు పంపారు.

గల్లా దెబ్బకు…

దీనికి డొక్కామాణిక్య వరప్రసాద్ అన్య‌మ‌న‌స్కంగానే అంగీక‌రించి పోటీకి దిగారు. అయితే, ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ పార్టీలో తీవ్ర ఎదురు దెబ్బ త‌గిలింది. పార్టీ ఎంపీగా పోటీ చేసిన గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌ర్గం డొక్కామాణిక్య వరప్రసాద్ కు వ్య‌తిరేకంగా లోపాయికారీగా ప్ర‌చారం చేసింది. ఎంపీ ఓటు టీడీపీకి వేయండి.. ఎమ్మెల్యే ఓటు మాత్రం మీయిష్టం అంటూ గ‌ల్లా వ‌ర్గం ప్ర‌చారం చేయ‌డమే త‌న‌కు వ్య‌తిరేకంగా మారిపోయింద‌ని డొక్కామాణిక్య వరప్రసాద్ బావించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న అనేక‌మార్లు గ‌ల్లా ఫ్యామిలీపై అధినేత చంద్ర‌బాబుకు ఫిర్య‌దులు చేశారు. అయితే, బాబు ఈ ఫిర్య‌ాదుల‌ను బుట్ట‌దాఖ‌లు చేయ‌డం డొక్కామాణిక్య వరప్రసాద్ కు మ‌రింత బాధ క‌లిగించింద‌నే విష‌యం వాస్త‌వం.

ఈ నెలాఖరుకు…

ఈ క్ర‌మ‌ంలోనే ఆయ‌న త‌న‌దారి తానుచూసుకునేందుకు రెడీ అయ్యార‌ని టీడీపీలోని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, వైసీపీ నుంచి కూడా డొక్కా డొక్కామాణిక్య వరప్రసాద్ ను పార్టీలోకి చేర్చుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా క‌నిపిస్తున్నాయి. అవ‌స‌ర‌మైతే.. ఆ ఎమ్మెల్సీ ఏదో తామే ఇస్తామ‌నే ఆఫ‌ర్లు కూడా వెళ్తున్నాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో వ‌స్తున్న వార్త‌ల‌ను డొక్కామాణిక్య వరప్రసాద్ ఖండిస్తున్నా.. మ‌న‌సు మాత్రం వైసీపీవైపు లాగుతోంద‌ని తెలుస్తోంది. మ‌నిషి మాత్ర‌మే టీడీపీలో ఉన్నార‌ని అంటున్నారు. జూపూడి ప్రభాకర్ రూట్ లోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ వెళతారంటున్నారు. ఏదేమైనా ఈ స‌స్పెన్స్ ఎపిసోడ్ ఈ నెలాఖ‌రులోగా ఫైన‌ల్ అవుతుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News