ఈ వైసీపీ ఎంపీకి ఎన్ని కష్టాలు?

అదృష్టం ఒకసారే తలుపుతడుతుంది. అప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఇక దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. రాజకీయాల్లోనూ అంతే. ఒక్కసారి గెలిచామని మౌనంగా ఉంటే అది చేతకానితనంగా భావిస్తారు. అలాగే [more]

Update: 2021-06-05 05:00 GMT

అదృష్టం ఒకసారే తలుపుతడుతుంది. అప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఇక దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. రాజకీయాల్లోనూ అంతే. ఒక్కసారి గెలిచామని మౌనంగా ఉంటే అది చేతకానితనంగా భావిస్తారు. అలాగే పార్టీలు వరస పెట్టి మారినా ప్రజలు దూరం పెడతారు. ఇందుకు కర్నూలు జిల్లాలోని మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుక, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈ జాబితాలో ప్రస్తుత ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా చేరిపోతారన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

గెలిచి రెండేళ్లవుతున్నా…..

పార్లమెంటు సభ్యుడిగా గెలిచి రెండేళ్లవుతున్నా ఆయన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించడం లేదు. నేతలతో సఖ్యత లేకపోవడం, తనను పట్టించుకోక పోవడం వల్లనే డాక్టర్ సంజీవ్ కుమార్ నియోజకవర్గ పర్యటనలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా డాక్టర్ సంజీవ్ కుమార్ ను పట్టించుకోవడం లేదు. దీంతో ఆయన అసలు రాజకీయంగా ఉన్నారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.

ఏ నియోజకవర్గంలోనూ…..?

కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ వీరెవ్వరూ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ను లైట్ గా తీసుకుంటున్నారు. దీంతో ఆయన కూడా మనకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారు. డాక్టర్ సంజీవ్ కుమార్ కు ఏరికోరి జగన్ గత ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారు.

బీసీ సామాజికవర్గం కావడంతో…?

డాక్టర్ సంజీవ్ కుమార్ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. 2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన బుట్టా రేణుక టీడీపీలోకి వెళ్లిపోవడంతో డాక్టర్ సంజీవ్ కుమార్ ను పార్టీలోకి తీసుకుని మరీ టిక్కెట్ ఇచ్చారు. ఆయన డాక్టర్ గా సుపరిచితులు. ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేత. అయితే గెలిచిన తర్వాత ఇటు నియోజకవర్గంలోనూ, అటు పార్లమెంటు సమావేశాల్లోనూ డాక్టర్ సంజీవ్ కుమార్ యాక్టివ్ గా లేరు. ప్రజల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. దీనికి కారణం సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులే కారణమంటున్నారు.

Tags:    

Similar News