Drugs case : అదే నిజమైతే జగన్ ను బీజేపీ వదిలిపెడుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. ముంద్రా పోర్టులో దొరికిన మూడు వేల కిలోల హెరాయిన్ కు వైసీపీ నేతలకు సంబంధం ఉందని టీడీపీ తీవ్ర [more]

Update: 2021-10-07 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. ముంద్రా పోర్టులో దొరికిన మూడు వేల కిలోల హెరాయిన్ కు వైసీపీ నేతలకు సంబంధం ఉందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇందులో బిగ్ బాస్ పాత్ర ఉందంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ ను విపక్షం టార్గెట్ చేస్తుంది. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఏపీ పోలీసులు మాత్రం అక్కడ దొరికిన హెరాయిన్ కు ఏపీకి సంబంధం లేదని చెబుతోంది. తాలిబాన్ ను తాడేపల్లి డ్రగ్స్ మాఫియా అంటూ తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తుంది.

అంతర్జాతీయ సమస్య….

డ్రగ్స్ సరఫరా రాష్ట్రానికి, దేశానికి సంబంధం ఉండదు. అంతర్జాతీయ మాఫియా పని అయిఉండాలి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి హెరాయిన్ సరఫరా అవుతుంది. ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిందే. చెన్నై, ముంబయి, గుజరాత్, ఢిల్లీలో హెరాయిన్ దొరికింది. 2021 నాటికి ఓపీఎం ను రెండు లక్షల హెక్టార్లలో అక్కడ పండిస్తున్నారు. పాక్ కుట్రలో భాగంగా జరుగుతున్నదే. ఎన్ఐఏ దీనిని దర్యాప్తు చేస్తుంది. దేశంలో ప్రతి ఏటా 70 వేల కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో ఎక్కువగా ఈ హెరాయిన్ సరఫరా ఎక్కువగా జరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి.

వారిదే దర్యాప్తు….

విజయవాడలో రిజిస్టర్ అయిన కంపెనీ పేరుతో డ్రగ్స్ ను తెప్పించారు. డీఆర్ఐ సమాచారం మేరకు ముంద్రా ఎయిర్ పోర్టులో హెరాయిన్ ను పట్టుకున్నారు. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్లు ఎక్కువగా ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసుల పాత్ర ఇందులో నామమాత్రమే. అయితే ఎన్సీబీ కోరినప్పుడు స్థానిక పోలీసులు సహకరిస్తారు. కానీ టీడీపీ వింత వాదన తెరమీదకు తెస్తోంది. ఇందులో వైసీపీ పాత్ర ఉందని పెద్దయెత్తున ఆరోపణలు చేస్తుంది.

వైసీపీ అయితే వదులుతారా?

నిజానికి వైసీపీి నేతలకు హెరాయిన్ తో సంబంధాలుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఊరుకుంటుందా? జగన్ పార్టీ జుట్టు చేతికి చిక్కితే ఆ అవకాశాన్ని సులువుగా వదిలేస్తుందా? రాష్ట్ర బీజేపీ కూడా ఈ డ్రగ్స్ దందాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నే ఈ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్ విషయంలో బీజేపీ ప్రభుత్వం చూసీ చూడనట్లు ఎందుకు విడిచి పెడుతుంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయి వైసీపీ నేతలపై టీడీపీ అటాక్ చేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. డ్రగ్స్ కేసును ఏపీకి అంటగడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు ప్రతిష్టను దిగజారుస్తున్నాయి.

Tags:    

Similar News