మరో వికెట్ అవుట్…? త్వరలోనే నిర్ణయమా?

నరేంద్ర మోదీకి వరస దెబ్బలు తప్పేట్లు లేవు. భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే ఒక్కొక్కరుగా ఎన్డీఏను వీడుతున్నారు. మరికొందరు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో జననాయక్ జనతా [more]

Update: 2020-12-31 17:30 GMT

నరేంద్ర మోదీకి వరస దెబ్బలు తప్పేట్లు లేవు. భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే ఒక్కొక్కరుగా ఎన్డీఏను వీడుతున్నారు. మరికొందరు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా కూడా ఉన్నారని తెలుస్తోంది. రైతులకు సంఘీభావంగా ప్రభుత్వం నుంచి బయటకు రావాలని ఇప్పటికే దుష్యంత్ చౌతాలాపై వత్తిడి పెరుగుతుంది. కొందరు జేజేపీ ఎమ్మెల్యేలు రైతులకు సంఘీభావం ప్రకటించడంతో దుష్యంత్ చౌతాలా కూడా పునరాలోచనలో పడ్డారు.

రైతుల ఆందోళనకు…..

దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనపై చర్చ జరుగుతుంది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కొద్ది రోజులుగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్డీఏలోని భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. మంత్రి వర్గం నుంచి కూడా తప్పుకున్నారు. ఇప్పుడు హర్యానాకు కూడా అది పాకిందంటున్నారు.

దుష్యంత్ చౌతాలా.….

హర్యానాలో జననాయక్ జనతా పార్టీ, బీజేపీ కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటక పోవడంతో జేజేపీ మద్దతు అవసరమయింది. దీంతో జేజేపీని కలుపుకుని హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ సాఫీగా నడుస్తున్న హర్యానా ప్రభుత్వంలో రైతు సమస్యలు చిచ్చు పెట్టాయని చెప్పాలి. దుష్యంత్ చౌతాలా పై ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని వత్తిడి పెరుగుతుంది.

గడువు పెట్టిన…..

అయితే దుష్యంత్ చౌతాలా కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువు పెట్టారు. తాము వ్యవసాయ చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించామని, అవి చేస్తే తమకు ఇబ్బంది లేదని దుష్యంత్ చౌతాలా చెబుతున్నారు. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం ఆలోచించుకోవాల్సి వస్తుందని దుష్యంత్ చౌతాలా పరోక్ష సంకేతాలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. మొత్తం మీద బీజేపీకి దుష్యంత్ చౌతాలా నిర్ణయం షాక్ ఇవ్వనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News